చంద్రబాబునాయుడు నివాసముంటున్న అక్రమనిర్మాణం లింగమనేని గెస్ట్ హౌస్ వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. లింగమనేని భవనం ప్రభుత్వ ఆస్తే అంటూ జగన్ మీడియా కథనం ప్రకారం తెలుస్తోంది. కరకట్ట మీద అక్రమంగా నిర్మించిన భవనాలపై 2016లో అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ లింగమనేని భవనాన్ని ప్రభుత్వం స్వధీనం చేసుకున్నట్లు ప్రకటించారు.

 

భూ సమీకరణ లేదా భూ సేకరణ రూపంలో లింగమనేని భవనాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది కాబట్టి తాను అక్రమనిర్మాణంలో ఉంటున్నట్లు కాదని వివరణ కూడా ఇచ్చారు. తాను చెప్పటమే కాకుండా లింగమనేని రమేష్ తో కూడా అదే విషయాన్ని చెప్పించారు.

 

లింగమనేని మీడియాతో మాట్లాడుతూ తన భవనాన్ని ప్రభుత్వానికి ఇచ్చిసినట్లు ధృవీకరించారు. అంటే ప్రభుత్వం చేసిన ప్రకటన లింగమనేని చెప్పింది రెండు ఒకటే కాబట్టి సదరు అక్రమనిర్మాణం ప్రభుత్వానిది అయిపోయినట్లు అందరూ అనుకున్నారు.

 

కానీ అధికారం కోల్పోయిన తర్వాత చంద్రబాబు ప్రభుత్వానికి లేఖరాస్తు ప్రైవేటు వ్యక్తి లింగమనేనికి చెందిన భవనంలో ఉంటున్నట్లు స్వయంగా ఒప్పుకున్నారు. అంటే ఒకటి  ముఖ్యమంత్రి హోదాలో అసెంబ్లీలో చేసిన ప్రకటన. మరోటి ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత రాతమూలకంగా చెప్పింది. అంటే రెండింటిలో ఏదో ఒకటే కరెక్టని తేలిపోయింది. ఆ రెండింటిలో ఏది కరెక్టు ?

 

ఏదంటే ప్రతిపక్ష హోదాలో చెప్పిందే కరెర్టని అర్దమైపోతోంది. జరుగుతున్నది చూస్తుంటే అబద్ధాలు చెప్పటం చంద్రబాబుకు బాగా అలవాటైపోయిన విద్యగా అర్ధమవుతోంది. అక్రమనిర్మాణం నుండి ఖాళీ చేయాల్సొస్తుందనే చంద్రబాబు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. తాను అబద్ధాలు చెప్పినట్లు బయటపడిపోయింది కాబట్టి ఇప్పటికైనా మూటా ముల్లె సర్దేసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతే మిగిలిన కాస్త గౌరవమైనా మిగులుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: