'కిసాన్‌ మిత్ర ' అంటే?
తెలంగాణ గ్రామీణ ప్రాంతంలో రైతుల కుటుంబాల్లో తీవ్రసంక్షోభం ఉంది.పంటల ఉత్పత్తి ఖర్చులు రోజురోజుకూ పెరిగిపోవడం, నకిలీ విత్తనాలు, గిట్టుబాటు ధరలు లేకపోవడం,సబ్సిడీలు అందక పోవడం, భూమి సమస్యలు, అప్పుల వల్ల రైతులు తీవ్ర వత్తిడికి లోనవుతున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో రైతుకు భరోసా నిచ్చే వినూత్న కార్యక్రమం 'కిసాన్‌ మిత్ర'. వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌ దివ్యదేవరాజన్‌ చొరవతో ఈ హెల్ప్‌లైన్‌ని 'సుస్థిర వ్యవసాయ కేంద్రం' ఆధ్వర్యంలో 14.4.2017న ప్రారంభించారు. ఎలా పని చేస్తుంది? ివ్యవసాయ అనుబంధరంగాలు,రెవిన్యూ శాఖలకు చెందిన సమస్యలపె గ్రామస్తులు ఏ నెట్‌ వర్క్‌ నుంచైనా టోల్‌ ఫ్రీ నెంబర్‌(1800.120.3244) కి ఫోన్‌ చేసి తమ సమస్యలను వివరించవచ్చు.

హెల్ప్‌లైన్‌ కార్యాలయంలో ఆ సమస్య రికార్డు అవుతుంది.అంతే కాకుండా ఆ సమస్యను సంబంధిత మండల అధికారికి పంపిస్తారు. వారు రైతుతో మాట్లాడి పరిష్కారం చేస్తారు. ఈ ప్రాజెక్టులో రైతు స్వరాజ్యవేదిక వాలంటీర్లు స్వచ్ఛందంగా పని చేస్తారు. రైతులకు కొండంత అండగా ఉన్న 'కిసాన్‌ మిత్ర' వికారాబాద్‌ జిల్లాకే పరిమితం అయినప్పటికీ, కలెక్టర్‌ దివ్య ప్రస్తుతం ఆదిలాబాద్‌ జిల్లా కలెక్టర్‌ గా ఉన్నారు. ఆక్కడి రైతులు కోరిక మేరకు ఆ జిల్లాలో కూడా ఏర్పాటు చేస్తున్నారు. 
ఆదిలాబాద్‌ రైతులకు 'దివ్య'మైన కానుక పుట్టి పెరిగిన కర్మ భూమినే కన్నబిడ్డగా భావించి ప్రకతి ప్రళయాలను,కల్తీ విత్తనాలను, గిట్టుబాటు ధర లేకపోవడం లాంటి అనేకానేక ఆపదలను తట్టుకుంటూ, నిరంతరం పరితపిస్తూ సకల మానవాళి మనుగడకి ప్రత్యక్షంగా, పరోక్షంగా పాటుపడుతున్న అన్నదాతలకు అండగా ఉండాలనే తపనతో యువకలెక్టర్‌ దివ్యాదేవరాజన్‌ దివ్యమైన ఆలోచన 'కిసాన్‌మిత్ర'. గతంలో,ఆమె కలెక్టర్‌గా పనిచేసిన వికారాబాద్‌జిల్లాలో ఈ కార్యక్రమం ద్వారా వందాలాది రైతుల సమస్యలను పరిష్కరించారు. నేడు ఆదిలాబాద్‌ జిల్లా కలెక్టర్‌గా అక్కడ కూడా 'కిసాన్‌ మిత్ర' ప్రారంభించారు. 'ఆదిలాబాద్‌ అటవీ ప్రాంతంలో 31.68 శాతం గిరిజనులే, ఉట్నూరు తండాలో రైతుకు కష్టం వస్తుంది, కలెక్టరాఫీసుకు రాగలడా? వీరికి మానసిక స్ధైర్యాన్ని పెంచి,వ్యవసాయ రంగంలో అభివృద్ది పథంలో ముందుకు నడిపించేందుకు జిల్లా ప్రభుత్వ యంత్రాంగాన్ని రైతుల కోసం పనిచేసేలా సమాయత్తం చేసేందుకు 'కిసాన్‌మిత్ర'ను ఈ రోజు నుండి ప్రారంభిస్తున్నాం' అని  వివరించారు, ఆదిలాబాద్‌జిల్లా కలెక్టర్‌ దివ్యదేవరాజన్‌.
..................................
ఆదిలాబాద్‌, వికారాబాద్‌ జిల్లాలో ' కిసాన్‌ మిత్ర 'టోల్‌ ఫ్రీ నెంబర్‌..1800.120.3244 
............................................


మరింత సమాచారం తెలుసుకోండి: