అధికారంలో ఉన్నపుడు చంద్రబాబునాయుడు ప్రవేశపెట్టిన కొన్ని పథకాలపై ఇపుడు సుప్రింకోర్టు సీరియస్ అయ్యింది. చంద్రబాబు అధికారంలో ఉండగా పసుపు-కుంకుమ, అన్నదాత సుఖీభవ పథకాలను ఎన్నికలకు ఆరు నెలల ముందు ప్రకటించారు. పైగా ఎన్నికల్లో ఓట్లు దండుకోవటం కోసమే చంద్రబాబు పథకాలను తెచ్చినట్లు అందరికీ తెలసిందే.

 

చంద్రబాబు ఏ ఉద్దేశ్యంతో పథకాలను తీసుకొచ్చినా, డబ్బులు వేసినా ఉపయోగం కనబడలేదనుకోండి అది వేరే సంగతి. పోలింగ్ ముందు లబ్దిదారుల ఖాతాలో డబ్బులు పడేట్లుగా చంద్రబాబు ప్లాన్ చేశారు. తన ప్లాన్ వర్కవుటైందని చంద్రబాబు కూడా చాలా సార్లే పార్టీ నేతలతో బహిరంగంగానే చెప్పారు. తీరా ఫలితాలు వచ్చిన తర్వాత చూస్తే జనాలు డబ్బులైతే తీసుకున్నారు కానీ ఓట్లు మాత్రం వైసిపికే వేశారని అర్ధమైపోయింది.

 

అయితే పథకాలను ప్రకటించిన విషయంపై అప్పట్లోనే చంద్రబాబుపై సుప్రింకోర్టులో కేసు వేశారు. అప్పట్లో ఏమీ స్పందించని సుప్రింకోర్టు ఇపుడు స్పందించిది. ఎన్నికలకు ముందు ఆరుమాసాల క్రితమే పథకాలు ప్రకటించటంలో అర్ధమేంటని చంద్రబాబుకు సుప్రింకోర్టు నోటీసులు జారీ చేసింది. వెంటనే సమాధానం చెప్పాలని కూడా నోటీసులోనే సుప్రింకోర్టు స్పష్టం చేసింది.

 

ఇక్కడ విచిత్రమేమిటంటే ఎన్నికలైపోయాయి. పోలింగ్ లో టిడిపికి జనాలు గూబగుయ్యిమనిపించారు. మరి ఇపుడు చంద్రబాబుకు సుప్రింకోర్టులో నోటీసులు ఇవ్వటంలో అర్ధమేంటి ? ఏమిటంటే, భవిష్యత్తులో మరెవరూ ఇలా చేయకూడదని సుప్రింకోర్టు ఉద్దేశ్యమట. చూద్దాం చంద్రబాబు ఏమని స్పందిస్తారో ?

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: