టీడీపీ నాయకులూ చాల ఎక్కువ చేస్తున్నారు అని అంటున్నారు నెటిజన్లు. గత అయిదేళ్లలో సాధించింది ఏమి లేదు కానీ నెల రోజుల నుంచి వైసీపీ ప్రభుత్వం పరిపాలిస్తుందాని ఏడుస్తున్నారు టీడీపీ నాయకులు. 30 రోజుల జగన్ పాలనా 30 తప్పులు అని, అన్ని కార్యక్రమాలు వాయుధాలు వెయ్యడం తప్ప ఏపీ అభివృద్ధి ఏమి లేదు అంటూ ట్విట్ లు చేస్తున్నారు టీడీపీ నాయకులు.  


ఈ ట్విట్లపై నెటిజనులు మాములుగా రియాక్ట్ అవ్వటంలేదు. '30రోజులు 30తప్పులా' '5 ఏళ్ళు లెక్కలేని అన్ని తప్పులు' అని ఒకరు కామెంట్ పెడితే మరికొందరు 'మీ ప్రభుత్వంలో గవర్మెంట్ బడులు ఉన్నాయా అస్సలు ? అని', 'ఎన్నికల 2 నెలల ముందు పెన్షన్ డబ్బు సక్రమంగా ఇచ్చిన మీరు మాట్లాడుతున్నారా' అని మరికొందరు ''మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు ఎం చేసారని ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు? మీ ప్రశ్నించే హక్కు లేదని'' దుమ్ము దులుపుతున్నారు నెటిజన్లు. 


ఈరోజు ఉదయం 'అవ్వకి,తాతకి ఈ మొదటి వారం మందుల్లేవు. గత 5 సంవత్సరాలలో ఈ పరిస్థితి ఏప్పుడు చూడలేదు'. అని దేవినేని అవినాష్ కామెంట్ పెట్టాడు దీంతో రెచ్చిపోయిన నెటిజన్లు నువ్వు ఇచ్చే పిన్షన్ తో నే గత ఐదు సంవత్సరాల్లో నేను మందులు కొన్న మనవడా అని వ్యగ్యంగా కామెంట్ పెట్టారు. ఉదయం నుంచి పెన్షన్ గురించి, రైతుల గురించి భారీగా ట్విట్టర్ లో స్పందిస్తున్న టీడీపీ నాయకులకు ప్రతిస్పందిస్తూ మీరు చేసిన అప్పుల వల్లనే అన్ని పనులు ఆగిపోయాయి. అన్ని సమస్యలు తీరుతాయి అని మరో నెటిజెన్ వైసీపీ తరఫునుంచి హామీ ఇచ్చాడు.  


ప్రస్తుతం వీటిపై విజయసాయి రెడ్డి స్పందిస్తూ, ''ఒక వైపు నిజాయితీగా పనిచేశామని బాజా కొట్టుకుంటారు. ఇంకో పక్క మాపై  విచారణకు ఆదేశించి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారంటారు. ఏ తప్పూ చేయని వారికి ఆందోళన ఎందుకు చంద్రబాబు గారూ? రాష్ట్రాన్ని చెదపురుగుల్లా తినేసి ఇప్పుడు సుమతీ శతకాలు వల్లిస్తే నమ్మేస్తారా? అని, నిరుద్యోగ యువతను గ్రామ వలంటీర్లుగా నియమిస్తుంటే మీకు జన్మభూమి కమిటీలు గుర్తుకొస్తున్నాయా చంద్రబాబు గారూ? ప్రజలను పీడించుకు తిన్న జన్మభూమి కమిటీలకు, గ్రామ వలంటీర్ల వ్యవస్థకు తేడా ఏమిటో తొందర్లోనే తెలుస్తుంది. అందాకా కాస్త ఓపిక పట్టండి'. అని వ్యాఖ్యానించారు విజయసాయి రెడ్డి. 

మరింత సమాచారం తెలుసుకోండి: