బీజేపీ తెలంగాణా రాష్ట్రంలో స్ట్రాంగ్ అవుతోంది.  అలా స్ట్రాంగ్ అయ్యేందుకు కావాల్సిన అన్ని మార్గాలను అన్వేషిస్తోంది.  తెలంగాణాలో కొద్దోగొప్పో బీజేపీకి బలం ఉన్న సంగతి తెలిసిందే.  గత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ నాలుగు పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధించింది.  వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణాలో పట్టు సాధించే దిశగా అడుగులు వేస్తోంది బీజేపీ.  


కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీలు బీజేపీలో జాయిన్ కావడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు.  మాజీలతో పాటు ఆ పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలు కూడా బీజేపీలో జాయిన్ అవుతారనే వార్తలు వస్తున్నాయి.  కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి బీజేపీలో జాయిన్ కావడానికి సిద్ధం అవుతున్నారు.


అలానే మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనరసింహ భార్య పద్మిని కూడా తిరిగి బీజేపీలో జాయిన్ కాబోతుందని వార్తలు వస్తున్నాయి.  వీరితో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతలకు చెందిన ద్వితీయశ్రేణి నేతలు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారు.  తెలుగుదేసం పార్టీ పూర్తిగా తుడుచుకుపెట్టి పోవడం, కాంగ్రెస్ పార్టీ బలం క్షిణించడంతో అందరి చూపులు బీజేపీ వైపు ఉన్నాయి.  


ఈనెల 6 వ తేదీన కేంద్రమంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా హైదరాబాద్ వస్తున్నారు.  అమిత్ షా సమక్షంలో ఈ నేతలంతా బీజేపీలో జాయిన్ అవుతున్నారని వార్తలు వస్తున్నాయి.  సో, జులై 6 వ తేదీన తెలంగాణాలో పెను మార్పులు చోటుచేసుకోబోతున్నాయన్నమాట..  ఎవరెవరు పార్టీ మారబోతున్నారో ఆరోజు తేలిపోతుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: