ఎన్నికలు పూర్తయ్యి చాలా కాలం అయ్యింది.  రిజల్ట్ వచ్చాయి ప్రభుత్వాలు ఏర్పడ్డాయి.  ఎన్నికల సమయంలో ఏ ఏ పార్టీలు ఎంతెంత ఖర్చు చేశారు అనే దాని గురించి ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి.  పార్టీలు ఎంత మొత్తంలో ఖర్చు చేశారు అనే దానిపై సమగ్ర నివేదికలు బయటకు వస్తుండటం విశేషం.  


ప్రస్తుతం దీనిపై ఓ నివేదిక వెలువడింది.  ఉభయ గోదావరి జిల్లాల విషయంలో ఈ నివేదిక వెలువడటం విశేషం.  ఉభయ గోదావరి నీళ్లలోని పశ్చిమ గోదావరి జిల్లాలోని రెండు పార్లమెంట్ నియోజక వర్గాలు, 15 అసెంబ్లీ నియోజక వర్గాలకు సంబంధించిన అభ్యర్థుల ఎన్నికల ఖర్చుల వివరాలను రిలీజ్ చేశారు.  


ఈ ఎన్నికల్లో ఆయా నియోజక వర్గాల్లో టిడిపి, వైకాపా, జనసేన పార్టీలు మొత్తంగా 9.16 కోట్లు ఖర్చు చేసినట్టు తెలుస్తోంది.  ఇది అధికారికంగా మాత్రమే ఖర్చు.  ఎమ్మెల్యేకు 28 లక్షలు, ఎంపీ 70 లక్షలు ఖర్చు చేసేందుకు ఈసీ అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే.  


అనధికారికంగా దీనికి మూడు నాలుగు రేట్లు అధికంగా ఖర్చు చేసి ఉంటారని అనుకోవచ్చు.  నరసాపురం నుంచి పోటీ చేసిన నాగబాబు విషయానికి వస్తే ఆయన 48 లక్షల రూపాయలను ఖర్చు చేశారని అధికారిక లెక్కలప్రకారం తెలుస్తోంది.  అనధికారికంగా ఎంత ఖర్చు చేసి ఉండొచ్చు అన్నది తేలాలి.  ఈ విషయాలను బయటకు ఎవరు చెప్పరనే సంగతి తెలిసిందే కదా.  


మరింత సమాచారం తెలుసుకోండి: