పేద విద్యార్థుల కోసం సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే హాస్టల్స్లో చాలా దుర్భరమైన పరిస్థితులు ఉంటాయి. సమాజం కోసం.... పేద ప్రజల కోసం పాటుపడాలని భావించే అధికారులు ఉన్న చోట్ల ఓకే గాని... చాలా హాస్టల్స్ లో మాత్రం అక్కడ ఉండి విద్యనభ్యసించే విద్యార్థులు చాలా ఘోరమైన పరిస్థితుల్లో మధ్య పోతున్నారు. తాజాగా మన పక్క రాష్ట్రం ఒడిశాలో ఒక వెల్ఫేర్ హాస్టల్ లో సంచలన సంఘటన చోటు చేసుకుంది. అమ్మాయిల హాస్టల్ లో ఏకంగా నలుగురు విద్యార్థినిలు గర్భవతులుగా తేల‌టం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది.


ఈ అంశం మహిళా కమిషన్ వరకు కూడా వెళ్ళింది. ఒడిశాలో ఇటీవల కాలంలో ఇలాంటి సంఘటనలు కామన్ అయిపోయాయి. ఈ సంఘ‌ట‌న‌ల‌పై ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. కొన్ని సంక్షేమ హాస్టల్స్ లో విద్యార్థినిలు ఏడు, ఎనిమిది తరగతుల్లోని గర్భవతుల‌వుతున్నారు. ఈ వ‌రుస సంఘ‌ట‌న‌ల‌కు బాధ్యులు ఎవరు ? అన్నది తేలాల్సి ఉంది. ఇటీవల వేసవి సెలవులు ముగియడంతో విద్యార్థినులు తిరిగి హాస్ట‌ల్స్‌కు వచ్చారు. ఈ క్రమంలోనే కొందరు విద్యార్థినులు అనారోగ్యానికి గురవ్వడంతో వారికి వైద్య పరీక్షలు చేయగా వారు గర్భవతులు అన్న విషయం బయటపడింది.


గర్భిణీలు అయినా విద్యార్థినులు అంతా మైనర్లే కావటం మరో దారుణమైన విషయం. ఈ సంఘటనపై విచారణ జరిపి... మరోసారి విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఒడిషా ప్రభుత్వం అధికారులు చెప్పారు. అయితే విద్యార్థినిలు బ‌య‌ట వారితో ఎక్కువుగా ప‌రిచ‌యాలు పెంచుకుంటున్నార‌ని... అందువ‌ల్లే ఈ సంఘ‌ట‌న‌లు త‌ర‌చూ జ‌రుగుతున్నాయ‌ని ప్రాథ‌మికంగా తెలుస్తోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: