జూనియ‌ర్ ఎన్టీఆర్‌కు చంద్ర‌బాబు, బాల‌య్య‌తో ఉన్న గ్యాప్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఇంకా చెప్పాలంటే వీరిద్ద‌రే ఎన్టీఆర్‌ను ప‌క్క‌న పెట్టారు. అవ‌స‌రం ఉన్న‌ప్పుడ‌ల్లా ఎన్టీఆర్‌ను తెర‌మీద‌కు తీసుకువచ్చి వాడుకుని వ‌దిలేస్తుంటారు. ఆ మాట‌కు వ‌స్తే చంద్ర‌బాబు ఎవ‌రిని అయినా ఇలాగే చేస్తుంటారని ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. 2009 ఎన్నిక‌ల‌ప్పుడు ఎన్టీఆర్‌తో ప్ర‌చారం చేయించుకుని ప‌క్క‌న పెట్టేశారు.


ఆ త‌ర్వాత ఎన్టీఆర్‌ను మ‌రీ వ‌దిలేశార‌న్న అప‌వాదు రాకుండా పెళ్లి చేసేసి మ‌రోసారి సైడ్ చేసేశారు. 2014లో ఎన్టీఆర్‌ను కాద‌ని ప‌వ‌న్‌ను తెచ్చుకుని ప్ర‌చారం చేశారు. చివ‌ర‌కు ఈ ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ కూడా బాబు ద‌గ్గ‌ర‌కు రాలేదు. మ‌ధ్య‌లో హ‌రికృష్ణ మృతి త‌ర్వాత సానుభూతి కోసం ఆ ఫ్యామిలీకి ద‌గ్గ‌ర‌య్యారు. హ‌రికృష్ణ కుమార్తె నంద‌మూరి సుహాసినిని కూక‌ట్‌ప‌ల్లిలో పోటీకి పెట్టి ఓడించి మ‌రీ ఆ ఫ్యామిలీ ప‌రువు తీసేశారు.


ఆ త‌ర్వాత మ‌ళ్లీ హ‌రికృష్ణ ఫ్యామిలీని ప‌క్క‌న పెట్టారు. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ ప్ర‌స్తుతం రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఆర్ ఆర్ ఆర్ సినిమాలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో కొమ‌రం భీం  పాత్ర‌లో చేస్తోన్న ఎన్టీఆర్ ఓ యుద్ధంలో ఓటమిపై చెప్పే డైలాగ్ ఎంతో ఉత్తేజంగా ఉంటుందట. ఈ డైలాగ్ టీడీపీని ఉద్దేశించి.. మంచి పొలిటిక‌ల్ మ‌సాలా ద‌ట్టించి పెట్టార‌న్న లీక్ అయితే వ‌చ్చింది.


ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్ట‌రీలో షూటింగ్ జ‌రుపుకుంటోన్న ఈ సినిమాలో ఎన్టీఆర్‌ తనను నమ్ముకున్న వాళ్ళ కోసం పోరాడి తన జీవితాన్ని అంకితం చేసే పాత్రలో న‌టిస్తున్నారు. వ‌చ్చే యేడాది జూలైలో ఈ సినిమా రిలీజ్ కానుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: