అంతర్జాతీయ నేరగాడు, ముంబయి అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు షాక్ త‌గిలింది. మాఫియా గ్యాంగ్‌లు సీక్రెట్ కోడ్ వాడటం కామన్. వాళ్ల కోడ్స్ అర్థం చేసుకోవడం అంత ఈజీ కాదు. అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం కూడా చాలా కోడ్స్ వాడుతాడు. అయితే డీ కంపెనీ వాడే కోడ సీక్రెట్లను అన్వేషించి ఆయ‌న‌ సహాయకుడు రియాజ్ భాటిని పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబయి క్రైం బ్రాంచ్ యాంటీ ఎక్స్‌టార్షన్ సెల్ రియాజ్‌ను అరెస్ట్ చేసింది. అరెస్ట్‌కు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


కాగా, దావూద్ ఇబ్రహీం.. ఇండియా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. 1993 ముంబై పేలుళ్ల సూత్రధారి. అతడు పాకిస్థాన్‌లోనే తలదాచుకుంటున్నాడని భారత్ ఎప్పటి నుంచో చెబుతూ వస్తోంది. కానీ పాకిస్థాన్ మాత్రం దావూద్ మా దగ్గర లేడని వాదిస్తున్నది. అయితే, గ‌త ఏడాది దావూద్ సన్నిహితుడు ఫరూక్ తక్లాను ఢిల్లీలో అరెస్ట్ చేసిన అనంత‌రం పోలీస్ కస్టడీలో దిమ్మదిరిగే విషయాలు చెప్పాడు.  తక్లా దుబాయ్‌లో కారు డ్రైవర్‌గా పనిచేసేవాడు. పాక్‌లో దావూద్‌కు లభిస్తున్న వీవీఐపీ ట్రీట్‌మెంట్ గురించి తక్లా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. అతనికి పాక్ రేంజర్సే భద్రత కల్పిస్తున్నారని కూడా వెల్లడించాడు. దావూద్ కరాచీలోని పోష్ క్లిఫ్టన్ ఏరియాలో ఉంటున్నాడు. అంతేకాదు ఓ వీవీఐపీ పాకిస్థాన్‌కు వచ్చినపుడు, అంతర్జాతీయంగా పాక్‌పై ఇండియా ఒత్తిడి తెచ్చిన సమయాల్లో దావూద్ ఎలా మకాం మారుస్తున్నాడన్న విషయాలు కూడా తక్లా చెప్పాడు. ఇలాంటి సమయాల్లో అండా గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్‌లో దావూద్ ఉంటున్నట్లు తక్లా తెలిపాడు. అక్కడికి దావూద్, అతని భార్యకు తప్ప వేరే ఎవరికీ అనుమతి ఉండదని చెప్పాడు. 


ఇక పాక్ అధికారులు దావూద్‌తో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఫ్రీక్వెన్సీలో మాట్లాడతారట. పాక్ రేంజర్లు దీని చుట్టూ 24 గంటలు పహరా కాస్తుంటారు. కోస్ట్‌గార్డ్ కూడా దావూద్ భద్రత చూసుకోవడంతోపాటు అతను ఎప్పుడు కావాలంటే అప్పుడు దుబాయ్‌కు వెళ్లేలా చూసుకుంటారని తక్లా సంచలన విషయాలను వెల్లడించాడు. అత్యంత భద్రత మధ్య ఆరు గంటల్లోనే బోటు ద్వారా దావూద్‌ను దుబాయ్‌కు చేరుస్తారట పాక్ అధికారులు. తాను కూడా అలా దుబాయ్‌లో ఒకసారి దావూద్‌ను రిసీవ్ చేసుకున్నానని, అక్కడి నుంచి వేరే ప్రాంతాలకు అతన్ని తీసుకెళ్లాననీ తక్లా చెప్పాడు. ఇక పాక్‌లోనే కొన్ని గ్రూపులు దావూద్‌ను చంపాలని చూస్తున్నట్లు తెలిపాడు. ఇలా 2000 నుంచి 2005 మధ్య చోటా రాజన్ గ్యాంగ్‌తోపాటు స్థానిక గ్యాంగ్ అతనిపై కొన్నిసార్లు హత్యాయత్నానికి ప్రయత్నించినట్లు చెప్పాడు. అసలు దావూద్‌ను ఇండియాకు తీసుకురావడం ఇక్కడి అధికారుల వల్ల కాదని కూడా తక్లా విచారణలో చెప్పినట్లు తెలిసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: