ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ ఉన్నారు. టీడీపీలో ఆయన్ని ఎదిరించే పెద్ద నాయకుడు ఎవరూ ఇప్పటికైతే కనిపించడంలేదు. అసెంబ్లీలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు సౌండ్ చేస్తున్నా బయట వేదికల మీద మాత్రం అలాంటి నాయకులు ఎవరూ లేరు.  ఎన్నికల ఫలితాలు వచ్చిన మొదట్లో తెలుగుదేశం పార్టీకి  దిమ్మ తిరిగి బొమ్మ కనిపించింది. అసలు ఎక్కడా సౌండే  లేదు.


. గత ప్రభుత్వ విధానాలపైన మంత్రి వర్గ ఉప సంఘంతో విచారణకు జగన్ ఆదేశైంచడంతో టీడీపీ నేతలకు  కాళ్ళూ చేతులు ఆడడంలేదు.  ఇక ఇదిలా ఉండగా జగన్ని సవాల్ చేసేందుకు చినబాబు రెడీ అయిపోవడమే విచిత్రం .  లోకేష్ అయితే  ట్విట్టర్ కి మళ్ళీ పదును పెడుతున్నారు. జగన్ పై అక్కడ కామెంట్స్ చేస్తూ నేనే లీడర్ అంటున్నారు.  లోకేష్ బాబే రంగంలోకి దిగి జగన్ని ఢీ కొట్టాలనుకుంటున్నారట. జగన్ కి తానే సరిజోడు అని భావిస్తున్న చినబాబు గత కొన్ని రోజులుగా ట్విట్టరి కి మళ్ళీ పని చెబుతున్నారు. 


జగన్ని ఎంతగా విమర్శిస్తే అంతలా జనం ఫోకస్ తన మీద పడుతుందని, తాను జగన్ స్థాయి నేతను అని అలా లోకానికి తెలుస్తుందని చినబాబు మాస్టర్ ప్లాన్ వేసినట్లున్నారు.  అయితే ట్విట్టర్ లో యుధ్ధం ఎంత చేసినా మాస్ కి అది చేరదని, ప్రజా క్షేత్రంలోనే లోకేష్ తన సత్తా చాటుకోవాలని తమ్ముళ్ళే సలహలు ఇస్తూండడం విశేషం. మరో వైపు వైసీపీ నాయకులు, మంత్రులు ట్విట్టర్ కూతలు కట్టిపెట్టి దమ్ముంటే మీడియా ముందుకు వచ్చి మాట్లాడు లోకేష్ అని సవాల్ చేస్తున్నారు. మరి ఇంతకీ లోకేష్ బాబు అలా కనబడకుండానే చీకట్లో బాణాలు వేస్తారా. లేక జనంలోకి వస్తారా. చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: