నుస్రత్ జహాన్.... పశ్చిమ బెంగాల్‌కు చెందిన నటి, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ. లోక్ సభకు తొలిసారి ఎన్నికైన ఆమె జూన్ 25న ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా నుస్రత్ జహాన్ చీరకట్టుతోపాటు నుదిటిపై సింధూ రం, చేతులకు గాజులతో అచ్చమైన హిందూ మహిళగా కనిపించారు. దీనిపై ఆగ్రహించిన ముస్లిం మత పెద్దలు ఫత్వా జారీచేశారు. ఎంపీ నుస్రత్ జహాన్ ట్విట్టర్‌లో దీటుగా బదులిచ్చా రు. కుల, మత వివక్షలకతీతంగా అఖండ భారత సంస్కృతిని నేను ప్రతిబింబింపజేస్తు న్నా. నేను ఇప్పటికీ ముస్లింగానే ఉన్నా. కానీ అన్ని మతాలను గౌరవిస్తా. నా ఆహార్యంపై వ్యాఖ్యలు చేసే హక్కు ఇతరులకు లేదు. ఆహార్యం కంటే విశ్వాసం గొప్పది. చాందసవాదుల వ్యాఖ్యలకు ప్రాధాన్యమిచ్చినా.. స్పం దించినా ద్వేషం, హింసకు దారితీస్తుంది. ఇది చరిత్ర చెప్పిన సత్యం అని ట్వీట్ చేశారు.


ఇలా సంచ‌లనం సృష్టించిన జ‌హాన్ తాజాగా మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. తన భర్తతో కలిసి ఈ నెల 4న కోల్‌కతాలో నిర్వహించే జగన్నాథ రథయాత్రలో పాల్గొననున్నారు. తమ ఆహ్వానానికి ఆమె అంగీకరించడంపట్ల ఇస్కాన్ అధికార ప్రతినిధి రాధరామన్ దాస్ కృతజ్ఞతలు తెలిపారు. నుస్రత్ జహాన్ నవ భారత్‌కు నిజమైన ప్రతినిధి. అఖండ భారత సంస్కృతిని ఆమె ప్రతిబింబిస్తున్నారు. ఇతర మతాల నమ్మకాన్ని గౌరవించడం, వారి పండుగల్లో పాల్గొనడం భారత్‌కు గొప్ప నిదర్శనం. భారత దేశం గొప్పదనం అందులోనే ఉంది. నుస్రత్ జహాన్ వంటి యువత నిజంగా మెరుగైన సమాజం వైపు రోడ్డు చూపుతున్నారు అని ఆయన ట్వీట్ చేశారు. ఇస్కాన్ రథయాత్ర కూడా సామాజిక సామరస్యంలో భాగమేనని తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: