లిక్క‌ర్ కింగ్‌, భారత్ బ్యాంకులకు కుచ్చుటోపీ పెట్టి విదేశాలు పారిపోయిన ఆర్ధిక నేరగాడు విజయ్ మాల్యా కేసులో ఊహించ‌ని ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. లండన్ చెక్కేసిన విజయ్‌ మాల్యాను విచారణ నిమిత్తం భారత్‌కు అప్పగించేందుకు సానుకూలంగా గతంలో లండన్‌ న్యాయస్థానం తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఈ తీర్పును సవాలు చేసేందుకు అనుమతించాలని అతడు హైకోర్టులో వేసిన పిల్‌ మంగళవారం విచారణకు వచ్చింది. వాదనలు విన్న న్యాయస్థానం భారత్‌కు అప్పగించేందుకు గతంలో న్యాయస్థానం ఇచ్చిన తీర్పును సవాలు చేసేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది.


త‌నను విచారణ నిమిత్తం మాల్యాను భారత్‌కు అప్పగించేందుకు సానుకూలంగా వెస్ట్‌మిన్‌స్టెర్‌ న్యాయస్థానం డిసెంబరు 2018న తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని మాల్యా మొదటిసారి న్యాయస్థానంలో అభ్యర్థన తిరస్కారానికి గురైంది. మళ్లీ అతడు హైకోర్టును ఆశ్రయించగా వాదనలు కొనసాగాయి. కోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలితే భారత్‌కు అతడిని అప్పగించే అవకాశాలు మెరుగ్గా ఉండేవి. కానీ గ‌తంలో న్యాయస్థానం ఇచ్చిన తీర్పును సవాల్ చేసుకునేందుకు అనుమతించాలని మాల్యా అభ్యర్దించగా.. దానికి హైకోర్టు అనుమతి ఇచ్చింది.


ఇదిలాఉండా, ఈ సందర్భంగా విలేకర్లు.. మాల్యాను కొన్ని ప్రశ్నలు అడిగారు. అందులో భాగంగా ఇంగ్లాండ్‌లో జరుగుతున్న ప్రపంచకప్‌పై మాల్యా ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు. భారత్ ఆటగాళ్లు అద్భుతంగా ఆడుతున్నారని.. ఖచ్చితంగా వరల్డ్‌కప్ భారత్ సొంతం అవుతుందని అన్నాడు. ఫైనల్‌లో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య భీకర పోరు జరుగుతుందని మాల్యా తెలిపాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: