ముఖ్యమంత్రి  జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు కొందరు మంత్రులు భేఖాతరు  చేస్తున్నారు . గత ప్రభుత్వ హయాం లో మంత్రుల వద్ద పనిచేసిన  పనిచేసిన వారిని పేషీల్లోకి తీసుకోవద్దంటూ జగన్మోహన్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన విషయం తెల్సిందే . కానీ కొంతమంది మంతులు మాత్రం గత ప్రభుత్వ హయాం లో మంత్రుల వద్ద ఓఎస్డీ , పీఏ,పీఎస్ లు గా పని చేసిన వారంటేనే మక్కువ చూపిస్తున్నారు. ఓఎస్డీ , పీఏ,పీఎస్ ల  నియామకంలో సీఎం ఆదేశాలను కొందరు మంత్రులు భేఖాతరు చేస్తుండడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది .


 టీడీపీ ప్రభుత్వ హయాం  మంత్రుల వద్ద పనిచేసిన వారిని ఇప్పటికే పలువురు   మంత్రులు తమ  పేషీల్లో పెట్టుకున్నారు . గతంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న  వారిని సైతం  మంత్రులు తమ వెనుక తిప్పుకోవడం విమర్శలకు దారి తీస్తోంది . అవినీతి రహిత పరిపాలనే లక్ష్యమని ఒకవైపు ముఖ్యమంత్రి చెబుతుంటే , మరొక వైపు మంత్రులు గత ప్రభుత్వ హయాం అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్న వారిని తమ వెనుక తిప్పుకోవడం ఏమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి .


 గత ప్రభుత్వ హయాం లో మంత్రుల వద్ద పని చేసిన వారిని విధుల్లోకి తీసుకోవద్దని  స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ, మంత్రులు బేఖాతరు చేయడం పట్ల ముఖ్యమంత్రి ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది .  గత ప్రభుత్వ హయాం మంత్రుల వద్ద పని చేసిన వారినే నియమించుకున్నారన్న విషయాన్ని తెలుసుకున్న ఆయన , మంత్రుల   పేషీల్లో సిబ్బంది నియామకంపై నిఘా నివేదికలు తెప్పించుకుంటున్నట్లు సమాచారం .


మరింత సమాచారం తెలుసుకోండి: