కరకట్టపై మాజీ ఎంపి గోకరాజు   గెస్ట్ హౌస్ కు సిఆర్ డిఎ అధికారులు నోటీసులు జారీ చేశారు .  తనకు  సిఆర్ డిఎ అధికారులు నోటీసులిచ్చిన విషయం వాస్తవమేనని ..వారం రోజుల్లో  సమాధానం చెబుతామని గంగరాజు తెలిపారు . గత 25 ఏళ్ళ క్రితమే తాను  ఉండవల్లి లోని  25 ఎకరాల్లో గెస్ట్ హౌస్ నిర్మించినట్లు చెప్పారు . తన గెస్ట్ హౌస్ నిర్మాణానికి  ఉడా, ఇరిగేషన్ అనుమతులున్నాయన్న ఆయన , బిపిఎస్ వచ్చిన తర్వాత అనుమతి కోసం దరఖాస్తు చేశాం..కాని రెగ్యులరైజ్ చేయలేదని చెప్పారు . 

 

గతంలో కృష్ణా నదీ పరివాహక ప్రాంతం లో   30 అడుగులు మాత్రమే వదిలి  నిర్మాణాన్ని చేసుకొమ్మని ఇరిగేషన్ అధికారులు తమకు పర్మిషన్ ఇచ్చారన్న గంగరాజు , నదిలో కూడా‌ ఇంకా మా ల్యాండ్ ఉందన్నారు . వరద వచ్చినప్పుడల్లా మా ల్యాండ్ కొంత కోల్పోయామని తెలిపారు . తాను గెస్ట్ హౌస్ నిమరించుకున్న  తర్వాత, నదీ పరివాహక ప్రాంతం లో  100 మీటర్ల లోపల నిర్మాణం చేపట్టకూడదన్న  జీవో ను ప్రభుత్వం తీసుకువచ్చిందన్నారు . తాను  ఎక్కడా నిబంధలు ఉల్లంఘించలేదన్న గంగరాజు, చట్ట ప్రకారమే నేను నడుచుకుంటానని వెల్లడించారు .

 

ప్రభుత్వ నిధులతో నిర్మించిన ప్రజావేదికను కూల్చిన విధంగా అన్నీ కట్టడాలను  కూల్చాలంటే రాష్ట్ర వ్యాప్తంగా నది వెంబడి ఉన్నటువంటివి ఎన్నో నిర్మాణాలని కూల్చాలని ప్రభుత్వానికి గంగరాజు షరతు విధించారు . నదీ పరివాహక ప్రాంతం లో తాను విలాసవంతమైన నిర్మాణాన్ని చేపట్టలేదని , కేవలం ఫార్మ్ హౌస్ మాత్రమే నిర్మించుకున్నానని చెప్పుకొచ్చారు . చిన్న చిన్న పొరబాట్లు అందరూ చేస్తారని , ప్రభుత్వం అందరిపైన చర్యలు తీసుకుని తమపై  తీసుకోవాలన్నారు . ఒకవైపు తాను ఎటువంటి అక్రమ నిర్మాణాన్ని చేపట్టలేదంటూనే, అందరూ పొరపాట్లు చేయడం సహాజమేనని పేర్కొనడం ద్వారా,  పరోక్షంగా తాను పొరపాటు చేశానని అయన చెప్పకనే చెప్పారు . 


మరింత సమాచారం తెలుసుకోండి: