తన భద్రతపై కొద్ది రోజులుగా చంద్రబాబునాయుడు ఆడిన డ్రామాలు బయటపడ్డాయి. తన భద్రతను రాష్ట్రప్రభుత్వం కుదించిందంటూ చంద్రబాబు అండ్ కో ఒక్కసారిగా ఆందోళన మొదలుపెట్టారు. ఐదేళ్ళ చంద్రబాబు పాలనలో జరిగిన అవినీతిని తవ్వి తీయటానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నాలు మొదలైన నేపధ్యంలోనే చంద్రబాబు డ్రామాలు మొదలయ్యాయి.

 

అయితే చంద్రబాబు మొదలుపెట్టిన డ్రామాలను జగన్ ప్రభుత్వం తొందరగానే కంట్రోల్ చేయగలిగింది. చంద్రబాబుకున్న జడ్ ప్లస్ క్యాటగిరి భద్రతను తామ కుదించలేదని హోం శాఖ హై కోర్టులో ఓ అఫిడవిట్ దాఖలు చేయటంతో డ్రామాలకు దాదాపు తెరపడినట్లే.

 

హోం శాఖ మంత్రి సుచరిత చెప్పినట్లుగా చంద్రబాబుకు జడ్ ప్లస్ క్యాటగిరిలో 58 మంది భద్రతా సిబ్బంది ఉండాల్సుంటే తమ ప్రభుత్వం 74 మందితో భద్రత కల్పిస్తున్నట్లు చెప్పారు.  ఎప్పుడైతే హోంశాఖ హై కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిందో అప్పటి నుండి టిడిపి నేతల నోళ్ళకు తాళం పడింది.

 


మరింత సమాచారం తెలుసుకోండి: