నిత్యవసర సరుకుల్లు, ఎలక్ర్టికల్ వస్తువులు ఇంకేమైన కానీ మనం కొనుగోలు చేసేవాటిపై భారత ప్రమాణాల సంస్థ- ISI మార్క్ కనబడుతుంది. ISI మార్క్ లేని వస్తువులు భారత ప్రమాణాల సంస్థకు విరుద్ధంగా తయారు చేయబడినవి. అలాంటి వాటని కొని ప్రమాదలపాలైతే మనకు ఎవరూ బాధ్యత వహించరు. భారత ప్రమాణాల సంస్థ మార్క్ కలిగి ఏమైన నష్టం వాటిల్లితే ఆ వస్తువు తయారీదారు సంస్థ మనకు పూర్తి పరిహారం అందజేస్తుంది.

అయితే ఇప్పుడు మంచినీరు కూడా నిత్యవసరమే... సహజసిద్ధంగా దొరికే మంచినీటిని మనమే కాలుష్య రహితం చేసుకొని చివరకు లీటర్ నీటిని 25 పైసలకు కొనుగోలు చేసుకునే పరిస్థితి ఏర్పడింది. ఇది కేవలం గ్రామాల్లో మాత్రమే... పట్టణాల్లో లీటర్ నీరు రూపాయి కూడా ఉంటుంది. కానీ మనం బయటకు వెళ్ళినప్పుడు లీటర్ బాటిల్ రూ.20 పెట్టి కొనుగోలు చేస్తాం. కేవలం రూ.20 కాదు మంచినీరు తయారీదారు సంస్థల ప్రకారం ఒక్కొక్క బాటిల్ పై ఒక్కొక్క రేటు ఉంటుంది. గరిష్టంగా అయితే రూ.2వేలు కూడా ఉన్నాయి. ఇంకా మన దేశంలో అంత ఖరీదైన బాటిల్స్ రాలేదు. ప్రస్తుతానికి లీటర్ నీరు రూ.80లు వరకు మాత్రమే ఉంది. ఇకపై మంచినీటి బాటిల్ పై కూడా భారత ప్రమాణాల సంస్థ లోగో ఉండాలి.

భారత ప్రమాణాల సంస్థ- ISI (ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్ స్టిట్యూట్ -) లోగో లేని బాటిళ్లలో నీళ్లు అమ్మితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కేంద్రం హెచ్చరించింది. కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ .. లోక్ సభ క్వశ్చన్ అవర్ లో ఈ ప్రకటన చేశారు. ఐఎస్ఐ మార్క్ లేని బాటిళ్లలో నీళ్లు అమ్ముతున్నారనేదానిపై కేంద్రానికి చాలా కంప్లయింట్లు వచ్చాయని చెప్పారు. ఐతే.. ఇలా అమ్మడం పెద్ద నేరం అని ఆయన అన్నారు. ఈ నేరానికి చట్టపరమైన శిక్ష తప్పనిసరిగా ఉంటుందని ఆయన అన్నారు. రాష్ట్రాల ప్రభుత్వాలు ఆ సంస్థలపై దాడులు చేసి.. యాక్షన్ తీసుకోవాలన్నారు.

బాటిల్ పై ఉన్న రేట్ కే వాటర్ ను కచ్చితంగా అమ్మాలని మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ అన్నారు. అలాకాకుండా ఎక్కువ రేట్ కు అమ్మినా కూడా నేరం అవుతుందన్నారు. వినియోగదారులు దీనిపై కోర్టులకు వెళ్లడం జరుగుతూనే ఉందన్నారు. దీనికి ఓ పరిష్కారం కోసం చూపిస్తామన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: