నారా లోకేష్ ఈ మధ్య ట్విట్టర్ లో చెలరేగిపోతున్నారు. అదేంటో గాని మీడియా ముందుకు వచ్చి దైర్యంగా మాట్లాడే సాహసం చేయకపోవటం ఇక్కడ గమనార్హం. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు తొలిసారి మీడియా ముందుకు పబ్లిక్ ముందుకు వచ్చారు. అయితే ఈ పాటికే హడావుడి చేయాల్సిన చినబాబు మాత్రం ఇంకా ట్విటర్ కే పరిమితం అవుతుండటం గమనార్హం.


లోకేష్ గత ఐదేళ్లలో కూడా బోలెడన్ని ట్వీట్లు చేశారు. ఆ ట్వీట్లలో ప్రత్యర్థులను విమర్శించారు ప్రత్యర్థులపై వ్యంగ్యాస్త్రాలు సంధించార - తమ గొప్పలు చెప్పుకున్నారు తమ కార్యకర్తల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. అయితే ట్విటర్ తో రాజకీయాలు నడవవు.నేటి రాజకీయాల్లో సోషల్ మీడియా ఇంపార్టెంటే. అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే సోషల్ మీడియా ద్వారా మాత్రమే రాజకీయాలు చేయడం కుదిరే పని కాదు.సోషల్ మీడియా అనేది వేడినీళ్లకు చన్నీళ్లలాంటిదే కానీ అంతకు మించి ఏమీ కాదు.


అయితే మీడియా ముందుకు వస్తే లోకేష్ ఏం మాట్లాడతారో ఆయనకే తెలియదు అనే విమర్శ ఉండనే ఉంది. ఇది వరకూ అనేక సార్లు అర్థరహితంగా మాట్లాడి లోకేష్ బాబు ఇరకాటంలో పడ్డారు.అప్పుడంటే అధికారం ఉండింది కాబట్టి ఏం చేసినా సరిపోయింది. ఇప్పుడు కూడా లోకేష్ మీడియా ముందుకు వచ్చి తడబడితే అంతే సంగతులు. అందుకే మీడియా ముందుకు వచ్చే ధైర్యం చేయడం లేదు లోకేష్ అనే విమర్శలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: