ప్రభుత్వరంగానికి చెందిన బ్యాంకులు ఉద్దేశ పూర్వక ఎగవేతదార్లుగా 2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ.1.50 లక్షల కోట్లు మోసం చేసినట్లు గుర్తించింది. వీటిలో మూడో వంతు వాటా ఉన్న స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ)దేనని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ మంగళవారం పార్లమెంటుకు తెలియజేశారు.

ఉద్దేశపూర్వక ఎగవేతదారుడు అంటే.. భారతీయ చట్టాల ప్రకారం రిజిషర్డు కంపెనీ లేదా వ్యక్తిగతంగా అతి పెద్ద వ్యాపారాలు ఉండి బ్యాంకుల నుంచి తీసుకొన్న రుణాలు చెల్లించే స్తోమత ఉన్నా చెల్లించకుండా ఎగవేసే వారిని ఉద్దేశపూర్వక ఎగవేతదారుడు అని పేర్కొంటారు.

స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియాను పెద్దమొత్తంలో ఉద్దేశపూర్వక ఎగవేతదార్లు ఎగనామం పెట్టారు. గత ఆర్థిక సంవత్సరం వరకు సుమారు రూ.46,158 కోట్లు కుచ్చు టోపి పెడితే.. రెండవ స్థానంలో పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు రూ.25,090 కోట్లతో 2వ స్థానంలో ఉంది. మూడో స్థానంలో బ్యాంకు ఆఫ్‌ ఇండియా రూ.9,890 కోట్లని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ మంగళవారం పార్లమెంటులో ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

రిజర్వుబ్యాంకు ఆఫ్‌ ఇండియా విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం మార్చి 31, 2019 నాటికి ప్రభుత్వరం గానికి చెందిన బ్యాంకులు రూ.63,820 కోట్ల రుణాలు లేదా అడ్వాన్స్‌లు ఇచ్చాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: