గరుడ పురాణం శివాజీని సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  విదేశాలకు వెళ్ళటానికి శివాజి శంషాబాద్ విమానాశ్రయంలో వెయిట్ చేస్తున్న నేపధ్యంలో  పోలీసులు అదుపులోకి తీసుకోవటం సంచలనంగా మారింది. టివి 9 యాజమాన్యం బదలాయింపు విషయంలో  మాజీ సీఈవో రవిప్రకాశ్ తో పాటు శివాజిని విచారించేందుకు సైబరాబాద్ పోలీసులు చాలా కాలంగా గాలిస్తున్నారు. ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా శివాజి ఏమాత్రం లెక్క చేయలేదు.

 

శివాజిని విచారించాలన్న పోలీసుల ప్రయత్నాలు విఫలమవ్వటంతో విచారణ ఏమాత్రం ముందుకు సాగటం లేదు. టివి 9 యాజమాన్యం బదాలియింపు వ్యవహారం సజావుగా ముందుకు సాగాలన్నా, వివాదాలు పరిష్కారమవ్వాలన్నా శివాజిని విచారించటం తప్పనిసరి. ఎందుకంటే, మాజీ సీఈవో రవిప్రకాశ్, శివాజిల మధ్య కొన్ని షేర్లు బదిలి వివాదాస్పదమైంది.

 

విచారణ నిమ్మితం రవిప్రకాశ్ తో పాటు శివాజిలకు సైబరాబాద్ పోలీసులు ఎన్ని నోటీసలు ఇచ్చినా ఏమాత్రం లెక్కచేయలేదు. దాదాపు నెల రోజుల తర్వాత రవిప్రకాశ్ తనంతట తానుగా పోలీసులకు ఆమధ్య లొంగిపోయారు. రవి లొంగిపోయినా శివాజీ మాత్రం పోలీసులకు దొరక్కుండా తప్పించుకు తిరుగుతున్నారు. ఒకవైపు తాను ఎటువంటి తప్పు చేయలేదని చెబుతున్న శివాజి పోలీసుల విచారణ నుండి మాత్రం తప్పించుకు తిరుగుతున్నారు.

 

పలుమార్లు వీడియా లీకులతో జనాలను కలుస్తున్నారే కానీ నేరుగా పోలీసు విచారణను ఎదుర్కొనే ధైర్యం మాత్రం చేయటం లేదు. ఇప్పటికే సైబరాబాద్ పోలీసులు శివాజీపై లుకౌట్ నోటీసులు జారీ చేసినా ఏమాత్రం ఉపయోగం కనబడలేదు. పైగా ముందస్తు బెయిల్ బుల్ పిటీషన్ ను కోర్టు కొట్టేసినా లొంగని శివాజీ మొత్తానికి శంషాబావ్ విమానాశ్రయంలో పోలీసులకు పట్టుబడటం గమనార్హం.

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: