గత కొంత కాలంగా ఆపరేషన్ గరుడ అనే కాన్సెప్ట్ తో తెగ పాపులారిటీ సంపాదించిన నటుడు శొంఠినేని శివాజీని సైబరాబాద్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  ఆయనను అలంద మీడియా కేసులో అదుపోలోకి తీసుకున్నట్లు సమాచారం. బుధవారం ఉదయం ఆయనను శంషాబాద్‌ విమానాశ్రయంలో పోలీసులు అదుపులోకి తీసుకుని సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. టివి9 రవిప్రకాశ్ కేసు బయటకు వచ్చినప్పటి నుంచి శివాజీ అజ్ఞాతంలో వెళ్లిపోయారు. 


అప్పుడప్పుడు టివిల్లో కనిపిస్తూ తన గురించి క్లారిటీ ఇస్తున్న పోలీసు ఎదుట మాత్రం రాలేక పోయారు. కొంత కాలంగా అజ్ఞాతంలో ఉన్న శివాజీ  విదేశాలకు వెళ్లే క్రమంలో పోలీసులకు చిక్కినట్లు తెలుస్తోంది. కాగా టీవీ—9లో అక్రమాలకు పాల్పడినట్లు కొత్త యాజమాన్యం ఫిర్యాదు చేయడంతో ఆ సంస్థ మాజీ సీఈఓ రవిప్రకాశ్‌పై పోలీసులు కేసు నమోదు చేసి, నోటీసులు జారీచేసిన విషయం తెలిసిందే.


అయితే ఈ కేసులో శివాజీకి కూడా హస్తం ఉందని తెలియడంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అప‍్పటి నుంచి శివాజీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. మరోవైపు తనపై సైబర్‌ క్రైమ్‌ పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ శివాజీ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తూ...పోలీసులు ముందస్తు అరెస్ట్‌ చేయకుండా స్టే ఇవ్వాలని పిటీషన్‌లో కోరిన విషయం విదితమేన.


మరింత సమాచారం తెలుసుకోండి: