ఏపికి తలమానికంగా నిలుస్తూ..ఎంతో మంది విద్యార్థులకు బంగారు భవిష్యత్తు అందిస్తున్న శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో గత కొంత కాలంగా జరుగుతున్న అవకతవకలపై విద్యార్థులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఎస్వీయూ  పరీక్షల విభాగంలో పారదర్శకతను తీసుకు రావాలని కోరుతూ ఎడ్యూకేషన్ సెల్ స్టేట్ కన్వీనర్ కల్లూరు విష్ణువర్థన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్వీయూ రిజిస్ట్రార్ ఆచార్య పి.శ్రీధరరెడ్డికి వినతి పత్రం ఇచ్చారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గతంలో విద్యార్థులకు సర్టిఫికెట్లను మంజూరు చేయలంటే నెలల తరబడి వేచి చూడాల్సి వచ్చేదన్నారు.  ఇటీవల కాలంలో ఎస్వీయూలో విద్యార్థుల సౌకర్యార్థం ఆన్ లైన్ విధానాన్ని ప్రవేశపెట్టడం వలన తొందరగా పరీక్షల ఫలితాలు, సర్టిఫికెట్లను తీసుకోవడం జరు గుతుందనిఅన్నారు. 

పరిపాలనలో పారదర్శకతను తీసుకురావడాలని, పరీక్షల విభాగాన్ని నూతన సాంకేతిక పరిజ్ఞానంతో ఆధునీకరించి విద్యార్థులకు కలుగుతున్న అసౌకర్యాలను భర్తీ చేయాలని కోరారు.  కల్లూరి విష్ణువర్థన్ తో పాటు ఎడ్యూకేషన్ సెల్ స్టేట్ నాయకులు మోహన్, మహేష్, దుర్గేష్, రాంబాబు, అజయ్, వెంకటేష్, మనోజ్, రామాంజనేయులు పాల్గొన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: