గత ఐదేళ్లలో చంద్రబాబు సర్కారు రాష్ట్రాన్ని దారుణంగా దోచేసిందని ఏపీ సీఎం జగన్ అంటున్నారు. అందుకే చంద్రబాబు హయాంలో జరిగిన టెండర్లన్నీలెక్కలు తీయిస్తున్నారు. విద్యుత్ ఒప్పందాల్లో ఇప్పటికే రెండున్నర వేల కోట్ల అవినీతి జరిగిందని జగన్ చెబుతున్నారు.


ఆ తర్వాత రంగం సాగునీటి ప్రాజెక్టులు.. వీటిపైనా మంత్రి వర్గ ఉపసంఘం లెక్కలు తీసే పనిలో ఉంది. ఇక మరో ప్రధాన రంగంలోనూ చంద్రబాబు సర్కారు అడ్డగోలుగా దోచుకుందని జగన్ చెబుతున్నారు. అదే గృహనిర్మాణ రంగం.


లక్షల ఇళ్లు కట్టించిన చంద్రబాబు ప్రభుత్వం.. చదరపు అడుగుకు మార్కెట్లో 1100 తీసుకుంటుంటే.. తన అనుచరులకు మాత్రం రూ. 2300 వరకూ కట్టబెట్టారని.. ఇలా వందల కోట్లు దోచుకున్నారని జగన్ అంటున్నారు. ఈ అర్భన్ హౌజింగ్ టెండర్లనూ తిరగదోడతామని జగన్ తేల్చేశారు.


వీటిలో పనులు పూర్తయిన వాటి సంగతి పక్కకు పెట్టి.. ఇంకా ప్రారంభం కాని.. కాస్తో కూస్తో ప్రారంభమైన ప్రాజెక్టుల్లో రివర్స్ టెండరింగ్ చేస్తామని జగన్ తేల్చి చెప్పారు. అర్బన్ హౌసింగ్ లో క‌డుతున్న ప్లాట్ల‌పై రివ‌ర్స్ టెండ‌రింగ్ కు వెళ్లాల‌ని జగన్ అధికారుల‌ను ఆదేశించారు. టెండర్లకు బాగా ప్రచారం చేసి ఎక్కువమంది రివ‌ర్స్ టెండ‌రింగ్ లో పాల్గొనేలా చూడాల‌న్నారు. షీర్ వాల్ టెక్నాల‌జీతో పేద‌ల‌పై టీడీపీ ప్రభుత్వం భారం మోపింద‌ని జగన్ అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: