ఓ ఉన్నతాధికారి మంచిపోస్టింగ్ కోసం ఏకంగా  ఉపముఖ్యమంత్రికే లంచం ఆఫర్ చేసిన ఘటన సంచలనంగా మారింది. లంచం కూడా అంతా ఇంతా కాదు ఏకంగా కోటి రూపాయలట. సదరు అధికారి లంచంమే  కోటి రూపాయలు ఆఫర్ చేశారంటే ఆయన సర్వీసులు ఇంకెంత సంపాదించుంటారు ? భవిష్యత్తులో ఇంకెంత సంపాదిస్తారు ? అనే చర్చ ప్రభుత్వ వర్గాల్లో విపరీతంగా చర్చ జరుగుతోంది.

 

ఇంతకీ విషయం ఏమిటంటే  నెల రోజుల క్రితం అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి వివిధ శాఖలను సమీక్షిస్తున్న విషయం తెలిసిందే. ఒకవైపు సమీక్షలు చేస్తూనే మరోవైపు బదిలీలను పారదర్శకంగా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.  కీలక స్ధానాల్లో ఉన్న అధికారుల బదిలీలకు శ్రీకారం చుట్టారు. ఇందులో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేన్స్ అధికారుల బదిలీలు  కూడా ఉన్నాయి.

 

ఈ నేపధ్యంలోనే ఓ సబ్ రిజిస్ట్రార్ నమ్మకస్తుడైన దళారీ ద్వారా ఏకంగా రెవిన్యుశాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ కే కోటి రూపాయలు ఆఫర్ ఇచ్చారు. ప్రస్తుతం ఎక్కడ పనిచేస్తున్నది తెలియలేదు కానీ విజయవాడ పడమటలో సబ్ రిజిస్ట్రార్ గా పోస్టింగ్ ఇస్తే కోటి రూపాయలు ఇస్తానని ఆఫర్ ఇచ్చారు.  ఉన్నతాధికారి ఆఫర్ తో విస్తుపోయిన పిల్లి అసలు ఆ అధికారి బ్యాక్ గ్రౌండ్ పై ఆరాతీస్తున్నారు.

 

అంతేకాకుండా భారీగా వసూళ్ళు చేయగలిగిన స్ధానాలు ఇంకెన్ని ఉన్నాయనే విషయంపై వివరాలు సేకరించారు. మంత్రికి అందిన వివరాల ప్రకారం విశాఖపట్నం, విజయవాడ పరిసర ప్రాంతాల్లోని ఆరు పోస్టింగులకు భారీగా డిమాండ్ ఉందని బయటపడింది. ఒకవైపు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ విభాగాన్ని ప్రక్షాళన చేయాలని జగన్ చెబుతుంటే మరోవైపు ఉపముఖ్యమంత్రికే కోటి ఆఫర్ రావటాన్ని జగన్ సీరియస్ గా తీసుకున్నారట.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: