ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేశ్ ట్వీట్టర్ ద్వారా మాటల యుద్ధం జోరు పెంచారు. రోజూ ఏదో ఒక అంశంపై ఆయన జగన్ ను టార్గెట్ చేస్తూ వరుసగా ట్వీట్లు చేస్తున్నారు. తాజాగా ఆయన ఇంటర్ విద్యార్థుల మధ్యాహ్నభోజనం రద్దు చేయాలన్న జగన్ ఆదేశాలపై స్పందించారు.


పొదుపు చేసుకోవాలంటే 2 లక్షల మంది పేద విద్యార్థుల నోటి దగ్గర ముద్దనే తీసెయ్యాలా? అంటూ ట్వీట్ ద్వారా ప్రశ్నించారు నారా లోకేశ్. జగన్.. తన రాజభవనం ముందు 1.3 కిమీ రోడ్డు వెయ్యడానికి రూ.5 కోట్లు ఖర్చు చేశారని విమర్శించారు. అదే రాజభవనం ముందు టాయిలెట్స్ కట్టడానికి 30 లక్షలు, బ్యారికేడ్లు పెట్టడానికి 75 లక్షలు, హెలిప్యాడ్ కు 1.89 కోట్లు ఖర్చు చేశారని విమర్శించారు.


తన అవసరాల కోసం ఇలా విచ్చలవిడిగా కోట్లు ఖర్చు పెడుతున్న @ysjagan గారు పేద ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అనవసరం అనడం దారుణమని లోకేశ్ మండిపడుతున్నారు. ఇటీవల విద్యాశాఖ సమీక్ష సందర్భంగా జగన్.. కాలేజీ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అవసరం లేదు అన్నట్టుగా వార్తలు వచ్చాయి. దీన్ని నారా లోకేశ్ తన అస్త్రంగా మలచుకున్నారు. మరి దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: