తెలుగుదేశం పార్టీ 37 సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో ఎప్పుడూ లేని విధంగా వ్యతిరేకత ఈ సంవత్సరం పెరిగిపోతూ ఉంది. తెలుగుదేశం పార్టీ ఆంధ్ర ప్రదేశ్లో రోజు రోజుకు బలహీనపడుతుంది. మరలా తెలుగుదేశం పార్టీ ఆంధ్ర ప్రదేశ్లో బలపడుతుందా అనే ప్రశ్నకు ఇక బలపడటం అనుమానమే అనే సమాధానం వినిపిస్తుంది. గతంలో ఎప్పుడూ తెలుగుదేశం పార్టీపై ఇంత వ్యతిరేకత లేదు. 
 
ఇప్పటికే నలుగురు రాజ్యసభ ఎంపీలు టీడీపీ  నుండి బీజేపీలోలోకి ఫిరాయించగా తెలుగుదేశం లోక్ సభ ఎంపీలు , ఎమ్మెల్యేలు కూడా వేరే పార్టీ లోకి మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. నిజానికి వీరంతా వైసీపీలో చేరాలని ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ రాజీనామా చేసి వైసీపీలోకి వెళ్ళాల్సి ఉండటంతో వైసీపీలోకి వెళ్ళడానికి ఆలోచిస్తున్నారు. 
 
అందువలన ఇప్పుడు ఈ నేతలందరూ బీజేపీ వైపు చుస్తున్నారు. ఎమ్మెల్యేలు అంతా మరో నెలలోపు పార్టీ మారడానికి ప్రయత్నిస్తున్నారని తెలుస్తుంది. ఉన్న 23 మంది ఎమ్మెల్యేలలో పది మంది దాకా పార్టీ మారే అవకాశం ఉన్నట్లు సమాచారం. బీజెపీ కూడా తెలుగుదేశం ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవడానికి సిధ్ధంగా ఉంది. ఒకవేళ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయిస్తే మాత్రం తెలుగుదేశాన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు మొదలయినట్లే. 



మరింత సమాచారం తెలుసుకోండి: