సినీ నటుడుగా పలు సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల నుండి మంచి పేరు సంపాదించిన నటుడు శివ శొంఠినేని. అయితే ఇటీవల కొన్నాళ్లుగా సినిమాలు చాలావరకు తగ్గించిన అయన, కొన్నేళ్ల క్రితం రాజకీయాల్లో చేరారు. అప్పట్లో భారతీయ జనతా పార్టీలో చేరిన శివాజీ, ఆ తరువాత సమైక్యాంధ్ర ఉద్యమం సమయంలో ఆంధ్రను విభజించకూడదని సమర్ధించిన వారిలో ఉన్నారు. ఇకపోతే ఆంధ్ర ప్రదేశ్ విడిపోయిన తరువాత అయన బీజేపీ ఏపీకి విభజన హామీలు నెరవేర్చలేదని, అలానే ప్రత్యేక హోదా కూడా ఇస్తామని ,మాటిచ్చి మోసం చేసిందని ఆ పార్టీపై విమర్శలు గుప్పించడం జరిగింది. అంతేకాక గత ఎన్నికల సమయంలో టిడిపి కూడా ఏపీకి హోదా తెస్తామని చెప్పి మాటతప్పిందని, అయన టీడీపీని కూడా టార్గెట్ చేస్తూ విమర్శలు చేసారు. 

అయితే ఆ తరువాత చంద్రబాబు వైఖరిలో మార్పు వచ్చిందని, అయన ఏపీకి మేలుచేసే విధంగా ముందుకు సాగడం తనకు నచ్చిందని తన స్వరాన్ని మార్చి, చంద్రబాబుకు అలానే టీడీపీ పార్టీకి అయన పరోక్షంగా మద్దతివ్వడం జరిగింది. ఇక ఆ తరువాత టివి9 రవిప్రకాష్ కేసులో శివాజీ కూడా కొన్ని మోసాలకు పాల్పడ్డారని ఆరోపణలు రావడంతో అయన ఒక్కసారిగా కనుమరుగయ్యారు. ఇక ఇటీవల ఆయనపై లుక్ అవుట్ నోటీసులు కూడా జారీ అవడంతో నేడు అయన అమెరికా వెళ్తుండగా ఎయిర్పోర్ట్ సిబ్బంది ఆయనను గుర్తించి, సైబర్ క్రైమ్ పోలీసులకు అప్పగించినట్లు తెలుస్తోంది. అయితే ఇంతవరకు బాగానే ఉన్నా, మొన్నటి ఎన్నికల సమయంలో శివాజి, పూర్తిగా చంద్రబాబు గారిని సమర్ధిస్తూ జగన్ పై పలు విమర్శలు చేసిన విషయం తెలిసిందే. 

అయితే ఇప్పుడు టివి9 కేసులో ఒక ముద్దాయి అయిన శివాజీకి అప్పట్లో టిడిపి నుండి ఏమైనా మేలు జరిగిందా, ఎందుకు అయన ఒక్కసారిగా టీడీపీని సమర్ధించడం మొదలెట్టారు, ఒకవేళ టీవీ9 కేసుతో టిడిపి వాళ్లకు కూడా ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో కూడా ఆయనపై విచారణ జరుపనున్నట్లు సమాచారం. అందువలన శివాజీ అరెస్ట్ తో టిడిపి నేతల్లో కొంత భయం కనపడుతోందని అంటున్నారు. అయితే ఈ విషయమై ఎవ్వరినుండి, ఎక్కడా అధికారిక సమాచారం లేనప్పటికి, ఈ కోణం ప్రస్తుతం కొన్ని మీడియా మాధ్యమాల్లో ప్రచారం అవుతోంది. అయితే ఈ వార్తపై పూర్తి నిజానిజాలు తెలియాల్సి ఉంది.....!!  


మరింత సమాచారం తెలుసుకోండి: