గత 35 సంవత్సరాలుగా ఆంధ్ర ప్రదేశ్లో బియ్యం, కిరోసిన్, ఇతర ముఖ్య నిత్యావసర వస్తువులు రేషన్ డీలర్ల ద్వారా పంపిణీ జరిగేది. ఈ రోజు వరకు కూడా ఆంధ్రప్రదేశ్లో రేషన్ డీలర్ల ద్వారానే పంపిణీ జరుగుతుంది. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం సెప్టెంబర్ నెల నుండి ఈ నిత్యావసరాలను రేషన్ డీలర్ల ద్వారా కాకుండా గ్రామ వాలంటీర్ల ద్వారా పంపిణీ చేయబోతున్నారు. 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం గ్రామ వాలంటీర్ల నియామకం జరుగుతుంది. సెప్టెంబర్ నెల నుండి సన్నబియ్యం మరియు ఇతర నిత్యావసర వస్తువులు ఈ గ్రామ వాలంటీర్ల ద్వారా వారికి కేటాయించిన 50 ఇళ్ళకు సరఫరా చేయాలని నిర్ణయించారు. ఈ గ్రామ వాలంటీర్ల ద్వారా ఈ నిత్యావసర వస్తువులు నేరుగా ఇంటి దగ్గరికే పంపిణీ కాబోతున్నాయి. సన్నబియ్యం 5, 10, 15 కేజీ ప్యాకెట్లలో రాబోతున్నాయి. 
 
మరి ఈ గ్రామ వాలంటీర్ల ద్వారా పంపిణీ చేయాలనే నిర్ణయంతో ఇప్పటిదాకా దీనిపై ఆధారపడి బ్రతుకున్న రేషన్ డీలర్ల పరిస్థితి ప్రస్తుతం అయోమయంలో ఉంది. ప్రభుత్వం వీరికి ఏదైనా ప్రత్యామ్నాయం చూపుతుందో లేదో తెలియట్లేదు. ఇప్పటిదాకా దీనిపై ఆధారపడిన వారు వెంటనే వేరే ఉద్యోగాలు చూసుకోవటం అంత తేలిక కాదు. మరి సీఎం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రేషన్ డీలర్ల గురించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి 



మరింత సమాచారం తెలుసుకోండి: