జగన్మోహన్ రెడ్డితో పాటు వివిధ జిల్లాల్లో కీలక వైసిపి నేతలపై ఒత్తిడి పెరిగిపోతోంది. టిడిపి నుండి కొన్ని వేలమంది ద్వితీయ శ్రేణి నేతలు వైసిపిలో చేరటానికి రంగం సిద్ధమైంది. అయితే జగన్ అందుకు అంగీకరించకపోవటంతో వారంతా ఎలాగైనా ఒప్పించేందుకు ఎవరి ప్రయత్నాలను వారు చేసుకుంటున్నారు.

 

ఇంతకీ విషయం ఏమిటంటే మండల, జిల్లా పరిషత్ పంచాయితీలకు మొదటి వారంలో పదవీకాలం అయిపోతుంది. సర్పంచుల పదవీ కాలం ఎప్పుడో అయిపోయిందనుకోండి. బహుశా వచ్చే నవంబర్ మాసంలోగా వాటన్నింటికీ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించాల్సుంటుంది.

 

అంటే సుమారుగా 13500 వేల సర్పంచులు, 7 వేల మండల పరిషత్ ఛైర్మన్లతో పాటు 650 జిడ్పిటిసిల పోస్టులు కూడా భర్తీ అవుతుంది. ఒక్కసారిగా ఇన్ని వేల పోస్టులు భర్తీ అవుతుండటంతో వాటిపై టిడిపి నేతల కన్ను పడింది. మొన్నటి ఘొర పరాజయం తర్వాత చంద్రబాబునాయుడు నాయకత్వంపై చాలామందిలో నమ్మకాలు పోయాయి.

 

స్ధానికంగా తమకున్న పరిచయాలతో వైసిపి నేతలను ప్రసన్నం చేసుకుని ఎలాగైనా వైసిపిలోకి దూరాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే ఇదే విషయమై వైసిపి సోషల్ మీడియా విభాగం ఎప్పటి నుండో ఆందోళన చేస్తోంది.  ఎన్నికల ఫలితాలు రాగానే చాలామంది టిడిపి నేతలు వైసిపిలో చేరటానికి ప్రయత్నాలు చేస్తున్నారని ఈ విషయంలో నేతలు అప్రమత్తంగా ఉండాలని పోస్టులు పెడుతున్నారు. మరి జగన్ నిర్ణయం ఎలాగుండబోతోంది చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: