జగన్మోహన్ రెడ్డి పాలనను ఆరు మాసాల పాటు పరిశీలిస్తామని చెప్పారు చంద్రబాబునాయుడు. కానీ నెల రోజులు కూడా టిడిపి నేతలు ఆగలేకపోయారు. కరకట్టపైన నిర్మించిన అక్రమనిర్మాణాలను కూల్చేయాలన్న జగన్ నిర్ణయమే  చంద్రబాబుతో పాటు టిడిపి నేతలు మండిపోయేట్లు చేసింది. దాంతో ఆరుమాసాలు సమయం ఇస్తామన్న చంద్రబాబు అండ్ కో కనీసం నెల రోజులు కూడా ఆగలేకపోయారు.

 

కరకట్టపై చంద్రబాబు ప్రభుత్వం నిర్మించిన అక్రమనిర్మాణాన్నే జగన్ ప్రభుత్వం కూల్చేయటంతో మొదలైన వ్యవహారం చివరకు శాపనార్ధాల వరకూ దారితీసింది. ఒకవైపు అక్రమనిర్మాణాన్ని కూల్చేసిన ప్రభుత్వం మరికొన్ని అక్రమనిర్మాణాలకూ నోటీసులిచ్చింది. అదే సమయంలో చంద్రబాబు పాలనలో జరిగిన అనేక అవినీతి వ్యవహారాలపై విచారణలో వేగం పెంచారు.

 

అవినీతి వ్యవహారాలపై జగన్ ప్రభుత్వం వేగం పెంచటాన్ని సహించలేని చంద్రబాబు, టిడిపి నేతల శాపనార్ధాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి.   రైతులకు విత్తనాలు అందటం లేదని టిడిపి మండిపోతోంది. నిజంగా విత్తనాలు సేకరించాల్సిన బాధ్యత చంద్రబాబు మీదుంది. చంద్రబాబు మీద కక్షసాధింపులకు దిగుతన్నట్లు జగన్ ప్రభుత్వంపై ఎల్లో మీడియా ద్వారా ప్రచారం తీసుకొస్తున్నారు.

 

అవగాహన లేకుండా తీసుకుంటున్న నిర్ణయాలే జగన్ కు శాపాలవుతాయంటూ మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అంటున్నారు. కెసియార్ తో జగన్ భేటీ వల్ల హైదరాబాద్ కే లాభం జరుగుతుందంటూ విజయవాడ ఎంపి కేశినేని నాని ఫేస్ బుక్ పోస్టులు పెడుతున్నారు. జగన్ చర్యల వల్ల రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు ఆగిపోతున్నాయంటూ చంద్రబాబు మండిపోతున్నారు. ముందుగా ఆరు మాసాలు సమయం ఇస్తామని చెప్పిన టిడిపి కనీసం నెల రోజులు కూడా ఆగలేక శాపనార్ధాలు మొదలుపెట్టిందని అర్ధమైపోతోంది.

 


మరింత సమాచారం తెలుసుకోండి: