గత అసెంబ్లీ ఎన్నిక్లలో అంతా ఉత్కంఠగా ఎదురు చూసిన నియోజకవర్గాల్లో మంగళగిరి ఒకటి. సీఎం చంద్రబాబు కుమారుడు నారా లోకేశ్ పోటీ చేయడమే అందుకు కారణం. సాక్షాత్తూ సీఎం కుమారుడు.. అందులోనూ మొదటిసారి పోటీ చేయడంతో అంతా ఇంట్రస్టింగ్ గా ఈ ఫలితం కోసం ఎదురు చూశారు.


వాస్తవానికి మంగళగిరిలో లోకేశ్ కు అనేక ప్లస్ పాయింట్లు ఉన్నాయి. రాజధాని నగరం.. చంద్రబాబు హయాంలో కాస్తో కూస్తో బాగుపడిన ప్రాంతం. అంగ బలం, అర్థబలం పుష్కలంగా ఉన్నాయి. ఐటీ మంత్రిగా లోకేశ్ కొన్ని కంపెనీలను తెచ్చారు. ఇవన్నీ తనకు కలసివస్తాయని లోకేశ్ అనుకున్నారు.


కానీ అనూహ్యంగా ఓటమి పాలయ్యారు. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డే మళ్లీ గెలిచారు. తన ఓటమి తర్వాత లోకేశ్ పెద్దగా ఎక్కడా మీడియా ముందు మాట్లాడలేదు. తాజాగా విలేఖరులతో చిట్ చాట్ నిర్వహించిన లోకేశ్.. మంగళగిరి ఓటమిపై స్పందించాడు.


మంగళగిరిలో ప్రజలకు చేరువయ్యేందుకు సరిపడా సమయం లేకే ఓడిపోయాను అంటూ పశ్చాత్తాపం ప్రకటించాడు లోకేశ్. ఇంకాస్త సమయంలో ఉండి ఉంటే ఫలితం ఇంకోలా ఉండేదని లోకేశ్ చెబుతున్నాడు. కానీ.. వాస్తవానికి ఇదే కారణమా.. అప్పటికీ లోకేశ్ కేవలం మంగళగిరిపైనే ఫోకస్ పెట్టి పోరాడాడు కదా.


మరింత సమాచారం తెలుసుకోండి: