కొన్ని రోజులుగా మాజీ సీఎం చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా సీఎం జగన్మోహన్ రెడ్డిగారిపై విమర్శలు చేస్తూనే ఉన్నాడు.రాష్ట్ర వ్యాప్తంగా రైతులు విత్తనాల కోసం నానాయాతన పడుతున్నారని, జగన్మోహన్ రెడ్డి గారి పాలన నాసిరకంగా ఉందని, అన్నదాతకు విత్తన భరోసా అయినా ఇవ్వమని నారాలోకేశ్ ట్విట్టర్ ద్వారా ట్వీట్లు చేసాడు. 
 
కానీ లోకేశ్ చేసిన విమర్శలకు వైసీపీ పార్టీ నుండి కౌంటర్లు బాగానే వచ్చాయి. విత్తన సేకరణ గత ప్రభుత్వ హయాంలో జరగాల్సిన పని అని కానీ గత ప్రభుత్వం ఆ విషయంపై నిర్లక్ష్యం చేయటం వలనే ప్రస్తుతం రైతులు ఇబ్బందులు పడుతుందని వైసీపీ ఆరోపించింది. గత ప్రభుత్వం తగిన సమయంలో విత్తన సేకరణ చేసి ఉంటే ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చేది టీడీపీ ప్రభుత్వం చేసిన పొరపాట్ల వలనే రైతులకు సకాలంలో విత్తనాలు అందించటానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని టీడీపీని విమర్శించారు. 
 
ఈ వ్యవహారం లోకేశ్ ఇక్కడితో ఆపేసి ఉంటే బాగుండేది. విత్తనాలో జగన్ ప్రభో అంటూ రైతులు గగ్గోలు పెడుతుంటే ! చంద్రబాబు వల్లే విత్తనాలు ఇవ్వలేకపోయమని చెబుతున్నారు అంటూ నారాలోకేశ్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించాడు. కానీ గతంలో ఉన్నది తమ ప్రభుత్వమే అని తమ ప్రభుత్వంలో నిర్లక్ష్యం వలనే ఇప్పుడు రైతులు ఇబ్బందులు పడుతున్నారని లోకేశ్ ఎందుకు గుర్తించకపోతున్నాడో. 



మరింత సమాచారం తెలుసుకోండి: