తెలుగుదేశంపార్టీ నేతలు ఏమి చేసినా చాలా డ్రమటిక్ గా విచిత్రంగా ఉంటుంది. మొన్నటి ఎన్నికల్లో టిడిపికి ఘోర ఓటమి ఎదురయ్యేసరికి తమ్ముళ్ళు డ్రామాలు మొదలుపెట్టారు.  తాజాగా కుప్పంలో పర్యటింస్తున్న చంద్రబాబునాయుడు పర్యటనలో డ్రామాలు పతాక స్ధాయికి చేరుకున్నాయి.

 

నేతలు ఓ టైం టేబుల్ ప్రకారం  జనాలను ముఖ్యంగా ఆడవాళ్ళను చంద్రబాబు దగ్గరకు పంపుతున్నారు. ఎన్నికల్లో నువ్వు  ఓడిపోవటం ఏంటయ్యా అంటూ ముక్కులు చీదుకుంటూ శోకాలు మొదలుపెడతారు. వాళ్ళని చంద్రబాబు ఓదార్చుతారు. ఆ ఫొటోలను నేతలు మీడియాకు లేకపోతే సోషల్ మీడియాకు రిలీజ్ చేస్తుంటారు. ఈ దృశ్యాలు చూడటానికి చాలా చికాగ్గా ఉన్నాయి.


ఎన్నికల్లో ఓడిపోయిన వెంటనే ఇటువంటి దృశ్యాలు కనిపించాయంటే అర్ధముంది.  జగన్మోహన్ రెడ్డి ప్రభత్వం ఏర్పడి నెలరోజులు దాటినా ఇంకా శోకాలేనా ? పైగా శోకాలు పెడుతున్నది కూడా పార్టీలో అత్యున్నత స్ధాయిలో అధికారాలను అనుభవించిన వారు కూడా కాదు. పార్టీలో కేవలం సభ్యుల్లాగే ఉన్నారు. అసలు వాళ్ళు పార్టీ మనుషులో కాదో కూడా అర్ధం కావటం లేదు.

 

కార్యకర్తల త్యాగాల ఫలితంగా పదేళ్ళ తర్వాత  వచ్చిన అధికారాన్ని చంద్రబాబు అవినీతి పాలనతో కంపు కొట్టిచ్చేశారు. అసలు ప్రతిపక్షమన్నదే లేకుండా చేయాలని అనుకున్నా  సాధ్యం కాలేదు. ఐదేళ్ళ తన పాలనలో అన్నీ విధాల ప్రభుత్వాన్ని భ్రష్టుపట్టించేసిన చంద్రబాబుకు మొన్నటి ఎన్నికల్లో పార్టీ ఎందుకు ఓడిపోయిందో అర్ధం కావటం లేదట. కుప్పం పర్యటనలో కూడా ఎక్కడికక్కడ జనాలను ఏర్పాటు చేసి ఈ శోకాల ఘట్టాన్ని బాగానే నేతలు రక్తి కట్టిస్తున్నారు. మరి ఎప్పటికి ఈ ఏడుపుల గోల ఆగుతందో ఏమో ?

 


మరింత సమాచారం తెలుసుకోండి: