వైసీపీ సీనియర్‌ నేత, పార్ల‌మెంటరీ పార్టీ నాయ‌కుడు విజయసాయిరెడ్డి పార్టీ కోసం వివిధ అంశాల‌పై ఏ విధంగా స్పందిస్తారో తెలిసిన సంగ‌తే. టీడీపీ నేతలే టార్గెట్‌గా ఇటు ఆన్‌లైన్లో అటు ఆఫ్‌లైన్లో విజ‌య‌సాయిరెడ్డి ఘాటుగా రియాక్ట‌వుతుంటారు. వైసీపీని అభినందిస్తుంటారు. అయితే, తాజాగా టీడీపీ అధ్య‌క్షుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును ఆయ‌న ప్ర‌శంసించారు. ఓ ట్వీట్లో చంద్ర‌బాబుపై రోసారి తనదైన శైలిలో స్పందిస్తూ వ్యంగ్యంగా పంచులు వేశారు. 


రాష్ట్రంలో విత్త‌నాల కొర‌త‌పై టీడీపీ విమ‌ర్శ‌లు చేస్తున్న నేప‌థ్యంలో....విజ‌య‌సాయిరెడ్డి ఆస‌క్తిక‌ర ట్వీట్ చేశారు. 'విత్తనాల సేకరణకు 380 కోట్లు విడుదల చేయాలని ఫిబ్రవరిలో ఏపీ సీడ్స్ కార్పోషన్ కోరితే ఆ నిధులను ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ఉపయోగించారు. పసుపు-కుంకుమ, పింఛన్ల పెంపుతో బురిడీ కొట్టించడానికి 30 వేల కోట్లు మాయ పేలాలు చేశారు. ఇంకా నిజాయితీ గురించి మాట్లాడుతున్నారంటే మీ ధైర్యానికి జోహార్లు బాబూ' అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.


సొంత సౌకర్యాల కోసం పోరాడడం మాని.. ప్రజల గురించి కాస్త గుర్తుంచుకోవాలని మ‌రో ట్వీట్లో విజ‌య‌సాయిరెడ్డి కోరారు. 'ప్రతిపక్ష నాయకుడిగా ప్రజా సమస్యలను గాలికొదిలి తన సౌకర్యాల గురించి పోరాడుతున్నారు చంద్రబాబు. ప్రభుత్వానికి రాసిన మొదటి లేఖలో ప్రజావేదికను కేటాయించాలని కోరారు. తనకు భద్రత పెంచాలని ఇప్పుడు హైకోర్టులో పిటిషన్ వేశారు. వేతనం తీసకుంటున్నందుకైనా ప్రజలను కాస్త గుర్తు పెట్టుకోండి బాబూ' అని ట్వీట్ చేశారు.



మరింత సమాచారం తెలుసుకోండి: