అధికార పార్టీ దన్ను ఓ వైపు, పసుపు పార్టీ నేతల మద్దతు మరో వైపు, ప్రజల కోసం, ప్రజల వాణిని వినిపిస్తాం అని బోరవిడుచుకున్న ఆ చానల్ మద్దతు మరో వైపు మొత్తానికి చూసుకుంటే గరుడపురాణం  శివాజీ హవాయే అప్పట్లో వేరు. ఆయన నోరు విప్పితే లైఫ్ టెలికాస్ట్. ప్రధాని నుంచి పొరుగు రాష్ట్ర సీఎం నుంచి  మొదలుపెట్టి అందరినీ విమర్శిస్తూ ఏపీలో  పెద్ద రాజకీయ పెత్తందారు  అయిపోయాడు.


మళ్ళీ వచ్చేది ఏపీలో టీడీపీ సర్కార్, బాబు ముఖ్యమంత్రి, తనకు కూదా పవర్లో వాటా వస్తుందనుకున్నాడో ఏమో కానీ బాగానే హద్దులు దాటేసాడు. జరిగేది, జరగ‌బోయేది  సోది చెప్తానంటూ జాతకరత్నం మిడతంబొట్లు మాదిరిగా కధలెన్నో చెప్పాడు. పురాణాల గుట్టు విప్పి  చెప్పి మరీ టాప్ రేంజికి వెళ్ళిపోయాడు. అప్పట్లో గరుడ పురాణం స్పెషల్ ఏంటి అంటే ముఖ్యమంత్రిగా ఉంటూ మందీ మార్బలం ఇంటలిజెన్స్ సపోర్ట్ పూర్తిగా ఉన్నా కూడా చంద్రబాబు కూడా గరుడ శివాజీ చెప్పిందే  నమ్మాడు.


అవునవును శివాజీ చెప్పినట్లే  అంతా జరుగుతోందని జనాలనూ నమ్మమని చెప్పారు బాబోరు. అవును ఈ గరుడ పురణాం వెనక కర్త, కర్మ, క్రియ అంతా  పసుపు మోతుబరులే కదా. మొత్తానికి సాగినన్నాళ్ళు సాగింది కధ. ఎన్నికల ఫలితాలతో మొత్తం అడ్డం తిరిగింది. ఇపుడు చూడాలి గరుడ పురాణంలోని పెరుగు వడ పాచిపోయింది. శివాజీ కూడా కనిపించకుండా పోయాడు. ఈ రోజు శమ్షాబాద్ ఎయిర్ పోర్టులో విదేశాలకు పోతున్న శివాజీని పోలీసులు పట్టుకున్నారు. మరి దొరికిన తరువాత కూడా పోలీసులకు శివాజీ గరుడ పురాణం కబుర్లే చెబుతాడా. చూడాలి మరి 


మరింత సమాచారం తెలుసుకోండి: