గత కొన్ని రోజులుగా పోలీసులకు దొరకకుండా తప్పించుకుని తిరుగుతున్న నటుడు శివాజీని ఎట్టకేలకు శంషాబాద్ ఎయిర్ పొర్ట్లో పోలీసులు పట్టుకున్నారు. టీవీ9 షేర్లు కొన్నట్లు తప్పుడు పత్రాలు సృష్టించిన కేసులో శివాజీకి గతంలోనే నోటీసులు జారీ అయ్యాయి. పోలీసులు ఎన్ని నోటీసులు జారీ చేసినప్పటికీ శివాజీ మాత్రం పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాలేదు. ఈరోజు ఉదయం 5 గంటల సమయానికి ఎమిరేట్ ఫ్లెయిట్ ద్వారా అమెరికాకు వెళ్ళాలని టికెట్ బుక్ చేసుకున్నాడు శివాజీ. 
 
తెల్లవారుజామున నాలుగున్నర గంటల సమయంలో శంషాబాద్ ఎయిర్ పోర్ట్లో నటుడు శివాజీని గుర్తించి సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శివాజీని సైబరాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు వార్తలు వస్తున్నాయి. గరుడ పురాణం అంటూ గతంలో చాలా హడావిడి చేసిన శివాజీ ఈరోజు చీటింగ్ కేసులో దొరకడం గమనార్హం. తాను ఎక్కడికీ పారిపోలేదని వడదెబ్బ వలన విచారణకు హాజరు కాలేకపోతున్నానని గతంలో వీడియో విడుదల చేసాడు శివాజీ. 
 
శివాజీ దొరకడంతో టీవీ9 షేర్ల వివాదానికి సంబంధించి నిజాలు తెలిసే అవకాశం ఉంది. ఈ కేసులో మరో నిందితుడిగా టీవీ9 రవిప్రకాష్ ఉన్నారు. రవిప్రకాష్ ను ఇప్పటికే అరెస్ట్ చేసిన పోలీసులు ఇప్పుడు శివాజీని కూడా అరెస్ట్ చేయడంతో ఈ కేసుకు సంబంధించిన నిజానిజాలు అతి త్వరలో తెలిసే అవకాశం ఉంది. ఇన్ని రోజులు తప్పించుకుని తిరిగిన శివాజీ ఇకముందైనా పోలీసులకు నిజాలు చెబుతాడో లేదో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: