చంద్రబాబు ఫక్త్ రాజకీయవాది. ఆయన రాజకీయం అంతా స్వార్ధమే పరమార్ధంగా సాగుతుందని ప్రత్యర్ధులు అంటారు. అన్న నందమూరిని మోసం చేసి కుర్చీ లాగేసిన చంద్రబాబు వెన్నుపోటు బాబుగా కూడా ముద్ర పడ్డారు. ఇక తన పర భేదం లేకుండా ఎప్పటికపుడు చెప్పిన మాటను చెప్పకుండా రాజకీయాన్ని నెట్టుకురావడంలో బాబు గారు ఘనాపాఠి.


ఇదిలా ఉండగా చంద్రబాబు ఏకంగా అసెంబ్లీలోనే అబద్దాలు చెప్పిన వైనం అప్పట్లో సెన్సేషన్. వైఎస్సార్ సీఎం గా ఉన్నపుడు చంద్రబాబు ఓ న‌కిలీ డాక్యుమెంట్ ని తీసుకువచ్చి సభలో ఉంచారు. దాని మీద వాదనలు పూర్తి అయ్యాక వైఎస్సార్ అసలు డాక్యుమెంట్ ఇదీ అనిబయటకు తీసేసరికి బాబోరికి మాటలు రాలేదు. అయినా సరే సర్దుకుని నేను నకిలీ  డాక్యుమెంట్ తెచ్చింది మీ చేత అసలు నిజాలు చెప్పించాలనే అన్నారట.


మొత్తానికి అలా నాటి సీఎం వైఎస్సార్ నే మోసం చేసిన చరిత్ర చంద్రబాబుదని ఆయన కుమారుడు, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పారు. ఈ రోజు కొత్త ఎమ్మెల్యేల, ఎమ్మెల్సీల శిక్షణా తరగతుల్లో ఆయన మాట్లాడుతూ   బాబు నోటి వెంట మాట్లాడితే అబద్దాలు  అలవోకగా వస్తాయని  హాట్ కామెంట్స్ చేశారు. కొత్త ఎమ్మెల్యేలు ఎవరూ బాబుని ఆదర్శంగా తీసుకోవద్దు అని కూడా జగన్ అనడం విశేషం.


మరింత సమాచారం తెలుసుకోండి: