భారత రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ, సంఘ్‌పరివార్‌ సారథ్యంలోని ఫాసిస్టు శక్తులు తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నాయని రాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ సమన్వయ సమితి అధ్యక్షుడు, మాజీ సీఎం సిద్దరామయ్య ఆందోళన వ్యక్తం చేశారు. టౌన్‌హాల్‌లో మంగళవారం ఆయన రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కాంట్రాక్టర్‌ల సంఘం ఏర్పాటు చేసిన సదస్సును లాంఛనంగా ప్రారంభించారు.

 

ఇదే వేదికపై ఆయన మిల్లర్‌ కమిషన్‌ నివేదిక శతమానోత్సవాలకు కూడా శ్రీకారం చుట్టారు. భారత రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ, సంఘ్‌పరివార్‌ సారథ్యంలోని ఫాసిస్టు శక్తులు తెరవెనుక ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నాయని రాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ సమన్వయ సమితి అధ్యక్షుడు, మాజీ సీఎం సిద్దరామయ్య ఆందోళన వ్యక్తం చేశారు. టౌన్‌హాల్‌లో మంగళవారం ఆయన రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కంట్రాక్టర్‌ల సంఘం ఏర్పాటు చేసిన సదస్సును లాంఛనంగా ప్రారంభించారు.

 

ఇదే వేదికపై ఆయన మిల్లర్‌ కమిషన్‌ నివేదిక శతమానోత్సవాలకు కూడా శ్రీకారం చుట్టారు. అనంతరం ప్రసంగిస్తూ రాజ్యాంగాన్ని మార్చాలని తలపోస్తే రక్తపాతం తప్పదని హెచ్చరించారు. సమాజంలో ఇంకా అసమానతలు, అంటరానితనం కొనసాగుతూనే ఉన్నాయన్నారు. దేశంలో ప్రతి ఒక్కరికీ అభివృద్ధి ఫలాలు దక్కేంతవరకు కొనసాగించాల్సిందేనన్నారు. దేశంలో రాజ్యాంగమే లేకపోతే మోదీ ప్రధాని అయ్యేవారు కాదు.. నేను సీఎం అయ్యేవాడిని కాను, అని సిద్దరామయ్య వ్యాఖ్యానించారు.

 

సంఘం అధ్యక్షుడు మహదేవస్వామి మాట్లాడుతూ టెండర్‌ రిజర్వేషన్‌లను పక్కాగా అమలు చేయాలని అలాగే అభివృద్ధి కార్పొరేషన్‌లలో రివాల్వింగ్‌ ఫండ్‌ను ఏర్పాటు చేయాలని, అభివృద్ధి పనుల కంట్రాక్టు పరిమితిని రూ.50లక్షల నుంచి కోటికి పెంచాలని విజ్ఞప్తి చేశారు. ఈ అన్ని అంశాలపై ముఖ్యమంత్రితో చర్చించి సముచిత నిర్ణయం తీసుకుంటామని సిద్దరామయ్య భరోసా ఇచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: