సినిమాల్లో హీరోయిన్ ఆపదలో ఉంటే హీరో వచ్చి ప్రాణాలు కాపాడుతుంటాడు.. విలన్ ఆ హీరోయిన్ ప్రాణాలు ఎలా తీయాలా అని ఆలోచిస్తాడు.. లేదా.. ఆమె శీలం దోచుకోవాలని ప్రయత్నిస్తుంటాడు.


కానీ ఇందుకు రివర్స్ లో విలన్ కూడా హీరోయిన్ ప్రాణాలు కాపాడే సన్నివేశం రియల్ లైఫ్ లో జరిగింది. శోభన్‌బాబు హీరోగా నటించిన దొరబాబు సినిమా షూటింగ్‌ లో ఈ తమాషా ఘటన జరిగింది. ఈ సినిమా కోసం అరకు జలపాతం వద్ద ఓ సీన్ తీస్తున్నారట.


ఆ సినిమాలో విలన్ శ్రీహరి. లతాశ్రీది సెకండ్ హీరోయిన్ పాత్ర.. లతాశ్రీ జలపాతం దగ్గర స్నానం చేస్తుంటే విలన్ శ్రీహరి వచ్చి అల్లరి పెట్టాలి..అదీ సీన్.. ఆ సీన్ చేస్తుంటే.. లతాశ్రీ సరిగ్గా చూసుకోకుండా జలపాతంలో వెనక్కు నడిచిందట.


ఆ పక్కనే లోతుగా ఉండటంతో లతాశ్రీ మునిగిపోయిందట. అంతే.. విలన్ శ్రీహరి హీరోలా మారి.. పైనుంచి దూకి ఆమెను కాపాడాడట. కిందామీదాపడి లతాశ్రీని పైకి లాక్కొచ్చి.. ఆ తర్వాత కోపం చెంప చెళ్లుమనిపించాడట. ముందూ వెనకా చూసుకోనక్కర్లేదా అంటూ క్లాస్ పీకాడట.


మరింత సమాచారం తెలుసుకోండి: