ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ పార్టీ, ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని పొందిన విషయం తెలిసిందే. అయితే గత ఎన్నికల సమయంలో టీడీపీ ప్రభుత్వం ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలు వంటి అంశాలపై గట్టిగా దృష్టిపెట్టకపోవడం వల్లనే ఈ ఎన్నికల్లో వారికి అంత తక్కువ సీట్లు రావడం జరిగిందని, నిజానికి చంద్రబాబు పాలన బాగున్నప్పటికీ, రాష్ట్రానికి వెన్నెముకగా భావించిన ఆ రెండు అంశాలపై అయన ప్రభుత్వం ప్రజలకు స్పష్టత ఇవ్వలేకపోవడమే వారి పార్టీ పరాజయానికి ముఖ్య కారణమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 

ఇకపోతే గత ఎన్నికల్లో అయన కుమారుడు లోకేష్ ని ఎమ్యెల్సీ ని చేసి ఎలాగోలా ఐటి మరియు పంచాయితీరాజ్ మంత్రిని చేసారు చంద్రబాబు. ఇక ఈ ఎన్నికల్లో చంద్రబాబు ఏకంగా లోకేష్ ను ప్రత్యక్ష ఎన్నికల బరిలో నిలపడం, అనూహ్యంగా అయన నిలబడిన మంగళగిరి నియోజకవర్గంలో వైసిపి కాస్త  బలంగా ఉండి, అక్కడి సిట్టింగ్ ఎమ్యెల్యే రామకృష్ణ రెడ్డి చేతిలో లోకేష్ ఘోరంగా ఓడిపోవడం జరిగిపోయాయి. అయితే కొన్ని రాజకీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం, చంద్రబాబు గారు గత ఎన్నికల సమయంలోనే లోకేష్ ను ఎమ్యెల్యేగా పోటీ చేయిద్దాం అని భావించారని, అయితే అప్పటికే అభ్యర్థులు ఖరారవడం వలన, ఈ ఎన్నికల్లో తప్పనిసరిగా పోటీకి నిలబెట్టడం జరిగిందని అంటున్నారు. అంతేకాక చంద్రబాబు గారు ఎప్పటికైనా లోకేష్ ను ఎమ్యెల్యేగా ఆపై ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్నారని, 

ఒక తండ్రిగా మంచి పట్టున్న పార్టీ అధినేతగా అలా చంద్రబాబు గారు ఆశపడడం తప్పుకాదని, అయితే దేనికైనా సమయం రావాలని వారు అంటున్నారు. నిజానికి ఒక్క ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రాన అంతా అయిపోయినట్లు కాదు కాబట్టి, చంద్రబాబు గారి కోరిక రాబోయే రోజుల్లో తీరవచ్చేమో అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ విషయమై కొందరు మాత్రం చంద్రబాబు గారి కోరిక కలలానే మిగిలిపోయినా మిగిలిపోవచ్చని లోలోపల గుసగుసలాడుతున్నారట. మరి అది ఎంతవరకు జరుగుతుందో రాబోయే రోజుల్లో కానీ తెలియదు......!!  


మరింత సమాచారం తెలుసుకోండి: