కాంగ్రెస్ పార్టీలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయానికి బాధ్యత వహిస్తూ కొన్ని రోజుల క్రితం పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆయన రాజీనామా ఉపసంహరించుకోవాలని పార్టీ నేతలంతా కోరుతూనే ఉన్నారు.


కానీ తన రాజీనామా నిర్ణయంపై ఏమాత్రం వెనుకడుగు వేయని రాహుల్... దాన్ని ఆమోదించాలని పట్టుబట్టాడు. ఇక తాను కాంగ్రెస్‌ అధ్యక్షుడిని కాదని, వెంటనే పార్టీ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలన్నారు. పార్టీ కొత్త అధ్యక్షుడి ఎంపికలో తన జోక్యం ఉండదని.. కాంగ్రెస్‌ వర్కింగ్ కమిటీ త్వరలోనే సమావేశమైన కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలని రాహుల్ అన్నారు.


దీంతో రాహుల్ ఇక తన నిర్ణయం మార్చుకునే అవకాశం లేదని అభిప్రాయానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కొత్త అధ్యక్షుడి ఎన్నికపై దృష్టి సారించింది. కొత్త అధ్యక్షుడు వచ్చే వరకూ కూడా అధ్యక్షుడిగా ఉండేందుకు రాహుల్ ఇష్టపడకపోవడంతో ప్రస్తుతానికి తాత్కాలిక అధ్యక్షుడిగా సీనియర్ నేత 91 ఏళ్ల మోతీలాల్ ఓరాను నియమించారు.


అయితే పార్టీ అధ్యక్షుడిగా ఉండేందుకు సీనియర్ నేతలు పలువురు విముఖత వ్యక్తం చేస్తున్నారు. ఆంటోనీ వంటి విధేయులు కూడా ఇందుకు అంగీకరించడం లేదు. మరి చివరకు కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికవుతారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: