కాంగ్రెస్ సీనియర్ నేత, వ్రుద్ధ నేత మోతీలాల్ ఓరా ఆ పార్టీకి తాత్కాలిక అధ్యక్షుడు అవుతున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ నాయకత్వం సమావేశమై నిర్ణయం తీసుకుంది. ఈ మధ్య జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం పాలు అయింది దాంతో ఆ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న రాహుల్ గాంధీ రాజీనామా చేశారు. తాను కాంగ్రెస్ పార్టీ భారం మోయలేనని కూడా రాహుల్ చెప్పుకొచ్చారు.


గాంధీ కుటుంబం కాకుండా కొత్త వారిని ఆ స్థానంలో ఎన్నుకోవాలని ఆయన కోరారు. అయితే రాహుల్ అధ్యక్షుడిగా ఉండాలని చాలా మంది గత నెల రోజులుగా పోరుతూనే ఉన్నారు. కానీ రాహుల్ మనసు మాత్రం మార్చలేకపోయారు. ఈ నేపధ్యంలో ఎట్టకేలకు అంతా అంగీకరించిన మీదట మోతీలాల్ ఓరా పేరుని కాంగ్రెస్ ప్రకటించింది.


కాంగ్రెస్ కి బయట అధ్యక్షులు కొత్త కాదు. గతంలో సీతారాం కేసేరి, పీవీ నరసిమ్హారావు  వంటి వారు పని చేశారు. అయితే పీవీ స్వతంత్రంగా పని చేయగా, సీతారాం కేసరి మాత్రం గాంధి కుటుంబానికి విధేయుడిగా మెలిగారు. ఇక చివర్లో అవమానంగా దిగిపోయారు కూడా. ఇపుడు కూడా ఎవరు అధ్యక్షులుగా ఉన్నా కూడా గాంధీ కుటుంబనే వెనక నుంచి వారిని శాసిస్తుందని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: