'ట్విట్టర్' ఆంధ్ర రాజకీయాలకు అసెంబ్లీ అయిపోయింది. రోజుకో ఒక న్యూస్ తీసుకొచ్చి రచ్చ రచ్చ చేస్తున్నారు రాజకీయ నాయకులూ. వైసీపీ ప్రభుత్వం తరుపున విజయ్ సాయి రెడ్డి ఉంటె ప్రతిపక్షం టీడీపీ తరుపున నారా లోకేష్ ఉన్నారు. వారు ఒక పాయింట్ తిస్తె వీరు నాలుగు పాయింట్లు తీసి నెటిజన్లకు కోపం వచ్చేలా చేస్తున్నారు. వైసీపీ నీరు అని అంటే ప్రతిపక్షం నిపు అంటుంది. ఇది అంత చూస్తున్న నెటిజన్లకు ఏది నిజమో ఏది అపద్దామో తెలియడం లేదు. దీంతో వారి ట్విట్టర్ ఖాతాలో రోజు రోజుకు ఫ్యాన్ ఫాలోవర్స్ సంఖ్య భారీగా తగ్గుతోంది. 


విజయ్ సాయిరెడ్డి నేడు ఉదయం రైతుల విత్తనాల గురించి ''విత్తనాల సేకరణకు 380 కోట్లు విడుదల చేయాలని ఫిబ్రవరిలో ఏపీ సీడ్స్ కార్పోషన్ కోరితే ఆ నిధులను ‘ఓటర్ల ప్రలోభాలకు’ మళ్లించారు. పసుపు కుంకుమ, పింఛన్ల పెంపుతో బురిడీ కొట్టించడానికి 30 వేల కోట్లు మాయ పేలాలు చేశారు. ఇంకా నిజాయితీ గురించి మాట్లాడుతున్నారంటే మీ ధైర్యానికి జోహార్లు బాబూ''. అంటూ ట్విట్ చేసారు. ఈ ట్విట్ పెట్టిన 5 నిమిషాలకే నారా వారి నుంచి మరో ట్విట్ ప్రశ్న.  


నారా లోకేష్ ట్విట్ చేస్తూ ''తన రాజభవనం ముందు 1.3 కిమీ రోడ్డు వెయ్యడానికి రూ.5 కోట్లు, టాయిలెట్స్ కట్టడానికి 30 లక్షలు, బ్యారికేడ్లు పెట్టడానికి 75 లక్షలు, హెలిప్యాడ్ కు 1.89 కోట్లు... ఇలా విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్న @ysjagan గారు పేద ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అనవసరం అనడం దారుణం. అని అంటున్నారు. విజయ సాయి రెడ్డి ఒక ట్విట్ చేస్తే లోకేష్ ఒక ట్విట్ చెయ్యాల్సిందే. ఈ ట్విట్ యుద్ధం చూస్తుంటే ఇప్పట్లో ముగిసేలా లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: