భాగ్యశ్రీ.. మైనే ప్యార్ కియా చిత్రంతో ఈ హీరోయిన్ దాదాపు 30 ఏళ్ల క్రితం సంచలనం సృష్టించింది. సల్మాన్ ఖాన్ హీరోగా నటింటిన ఈ చిత్రం.. దేశంలోని చాలా భాషల్లో డబ్బింగై ఘన విజయం అందుకుంది. ఒక్క సినిమాతోనే భాగ్యశ్రీ ఓవర్ నైట్ సూపర్ స్టార్ అయ్యింది.


అయితే హీరోయిన్ అయిన కొద్దికాలంలోనే ఆమె నిర్మాత హిమాలయ్ తో ప్రేమలో పడటం, పెళ్లి చేసుకోవడం జరిగిపోవడవం వల్ల ఆమె సినిమా కెరీర్ అంత గొప్పగా సాగలేదు. ఆమె తన భర్త హిమాలయ్ ను కూడా సినీ హీరోగా సక్సస్ చేద్దామని ప్రయత్నించినా వీలు కాలేదు.


ఇప్పుడు అదే భర్త హిమాలయ్.. గ్యాంబ్లింగ్‌ కేసులో అరెస్టయ్యారు. ముంబయిలోని అంబోలీ పోలీసులు హిమాలయ్ ను అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపరిచిన తర్వాత బెయిల్‌పై విడుదల చేశారు. కొన్నిరోజుల క్రితం ఇదే ప్రాంతంలో ఓ గ్యాంబ్లింగ్ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వారిని విచారించినప్పుడు వెల్లడైన సమచారం ఆధారంగా హిమాలయ్ ను అరెస్టు చేసినట్టు తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: