టీడీపీ పార్టీ ఘోర ఓటమి తరువాత ఆ పార్టీలో తిరుగుబాట్లు మొదలయ్యాయి. అధినేతకు తాము చెప్పాల్సిన విషయాలను మొహం మీదే చెప్పడం గమనార్హం. చంద్రబాబు తర్వాత ఆయన వారసుడైన లోకేష్ బాబుపై సొంత పార్టీలోనూ.. బయటా నాయకత్వం సామర్థ్యంపై ఎన్నో అనుమానాలున్నాయి.. ఆయనను టీడీపీ భవిష్యత్తుగా గుర్తించడానికి ఏ నేత సహసించడం లేదట. లోకేష్ బాబు భాషా ప్రయోగం నుంచి రాజకీయాల్లో చేసిన పనులన్నీ నవ్వుల పాలే అయ్యాయని కథలు కథలుగా చెబుతారు.. సరైన పరిజ్ఞానం - నాయకత్వ లక్షణాలు లేని లోకేష్ ను ఇప్పుడు టీడీపీలో ఒప్పుకునే పరిస్థితి లేదని నేతలు గళం వినిపించినట్టు ప్రచారం జరుగుతోంది.


తాజాగా లోకేష్ నాయకత్వం వద్దంటూ టీడీపీలో మరో తిరుగుబాటు  మొదలైందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవలే సమావేశమైన కాపు నేతలు  లోకేష్ పెత్తనం టీడీపీలో కొనసాగితే తాము టీడీపీలో కొనసాగలేమని చంద్రబాబుకు స్పష్టంగానే ముఖం మీదే చెప్పేశారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. లోకేష్ ను నమ్ముకొని తాము మునిగిపోలేమని వారు కుండబద్దలు కొట్టారట. తర్వాత ఎన్నికల్లో సీటు ఇచ్చి గెలిపిస్తామని అంటేనే ఉంటామని.. లేకుంటే కష్టం అని చంద్రబాబుకు ఇన్ డైరెక్ట్ గానే కాపు నేతలు చెప్పినట్టు సమాచారం. 


ఇక లోకేష్ వ్యవహారశైలిపై చంద్రబాబుకు వారు ఉదాహరణలతో ఫిర్యాదు కూడా చేసినట్టు సమాచారం. టీడీపీ హయాంలో మేము ఏమీ చెప్పినా లోకేష్ బాబు మాకు ఎప్పుడూ కూడా సపోర్టు చేయలేదని వారు బాబుకు బాధ చెప్పుకున్నారట.. ఒకప్పుడు కాపు సామాజికవర్గం మద్దతు టీడీపీకి బాగా ఉండేదని.. ఇప్పుడు మద్దతు పోయిందని.. దాన్ని నిలబెట్టుకోవాలంటే లోకేష్ ను దూరంగా పెట్టాలని వారు స్పష్టం చేసినట్టు తెలిసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: