ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి కేసు దర్యాప్తు వేగవంతమవుతోంది. సరిగ్గా ఎన్నికల సమయంలో వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురికావడం అప్పట్లో సంచలనం సృష్టించింది.


ఈ హత్య ఎన్నికల కారణంగా రాజకీయ రంగు కూడా పులుముకుంది. ప్రత్యేకించి టీడీపీ వివేకాహత్యను దాదాపు ప్రతి ఎన్నికలసభలోనూ ప్రస్తావించింది. సొంత బాబాయిని హత్య చేసినా దిక్కులేదంటూ పవన్ కల్యాణ్ కూడా విమర్శించారు.


ఐతే.. ఎన్నికల ముందు అంతగా ఊపందుకోని దర్యాప్తు.. జగన్ సీఎం అయిన తర్వాత జోరందుకుంది. సిట్ తో పాటు మరో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయడంతో విచారణ జోరందుకుంది. తాజాగా దస్తగిరి అనే వ్యక్తిని సిట్ విచారించింది.


వివేకానంద హత్యకు సంబంధించిన కీలక ఆధారాలు ఈ దస్తగిరి దగ్గర ఉన్నట్టు సిట్ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. సాధ్యమైనంత త్వరగా ఈ హత్య కేసు చిక్కుముడి విప్పాలని భావిస్తున్న పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు ముమ్మరం చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: