ఆక్వా రైతులకు విద్యుత్‌ చార్జీలను యూనిట్‌కు రూ.1.50లకు తగ్గిస్తూ విద్యుత్‌శాఖ ఆదేశాలిచ్చింది. ఆక్వా రైతులకు యూనిట్‌ విద్యుత్‌ చార్జీ రూ.1.50లకు అందిస్తే ఏడాదికి రూ.720 కోట్లు సబ్సిడీ అదనంగా అవసరమవుతాయని డిస్కం సీఎండీలు ప్రభుత్వానికి నివేదించారు.


దీంతో ప్రభుత్వం ఏపీఈఆర్సీ నిర్ణయించిన రేట్‌ నుంచి రూ.1.50లకు తగ్గిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. డిస్కంలు ఆక్వారైతుల నుంచి యూనిట్‌కు రూ1.50లు వసూలు చేస్తాయని, విద్యుత్‌శాఖ డిస్కంలకు సబ్సిడీ మొత్తాన్ని అందిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఏపీ ట్రాన్స్‌కో, ఏపీఈపీడీసీఎల్‌, ఏపీఎస్‌పీడీసీఎల్‌ సీఎండీలు ఆ మేరకు చర్యలు తీసుకోవాలని విద్యుత్‌శాఖ కార్యదర్శి ఎన్‌. శ్రీకాంత్‌ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.


ఆక్వా రైతుల నుంచి విద్యుత్‌ చార్జీలు ఏపీఈఆర్సీ నిర్ణయించిన ధర ప్రకారం యూనిట్‌కు రూ.3.86లు వసూలు చేస్తున్నారు. గత ఏడాది కూడా ఆక్వారైతులకు విద్యుత్‌ చార్జీలు యూనిట్‌కు రూ.2.00లకు తగ్గించారు. ఆక్వారైతుల విజ్ఞప్తి మేరకు తాజాగా రూ.1.50లకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: