ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్ఫూర్తితోనే ఆమె ఎంపీ అయ్యిందని మాజీ సినీనటి నవనీత్ కౌర్ చెప్పారు. ఇటీవలే జరిగిన లోక్ సభ ఎన్నికల్లో 'మహారాష్ట్ర అమరావతి' నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేసి భారీ మెజారిటీతో ఎన్నికైన నవనీత్ కౌర్ ఈరోజు మీడియాతో మాట్లాడారు. ఆ సమయంలోనే ఏపీ సీఎం వైఎస్ జగన్ గురించి ప్రస్తావించారు. ఎన్ని కష్టాలు వచ్చినా వైఎస్ జగన్ రాష్ట్రానికి మంచి చేయాలనే తపనతో గత తొమ్మిది సంవత్సరాలు ఎంతో కష్టపడ్డారని, ఆ కష్టానికి ఇప్పుడు ఫలితం దక్కిందని నవనీత్ కౌర్ వ్యాఖ్యానించారు. ఎప్పటికప్పుడు జగన్ చేసే మంచి పనులు తను ఫాలో అవుతుందని ఆమె చెప్పారు. జగన్ ని ఫాలో అవ్వడం వల్లే ఆమె ఎంపీ స్థాయిలో ఉందని వ్యాఖ్యానించారు. 


 2014లోనే ఆమె మహారాష్ట్రలో ఎంపీగా పోటీ చేసి ఒడిపోయారని, ఆ సమయంలో ఏడు సార్లు ఎంపీగా గెలిచిన ఎంపీపై పోటీ చేయాల్సి వచ్చిందని, సోషల్ మీడియాలో ఆమెపై దుష్ప్రచారం చాలా జరిగిందని, అందుకే ఆ సమయంలో ఒడిపోవాల్సి వచ్చిందని ఆమె తెలిపారు. అయితే ఓడిపోయినందుకు ఆమె ఏమాత్రం కుంగిపోలేదని, ఎందుకంటే ఆమె స్ట్రాంగ్ అండ్  ఇండిపెండెంట్ ఉమెన్ అని, 2014లో ఓడినప్పటికీ ఆమె ఎంతో కష్టపడి పనిచేసి 2019 ఎన్నికల్లో భారీ మెజారిటీతో మహారాష్ట్ర అమరావతి నుంచి ఎంపీగా గెలిచారని చెప్పారు. 


ఆమె గెలుపు వెనుక ఆమె భర్త సపోర్ట్ ఎంతో  ఉందని చెప్పారు. 13 సంవత్సరాలకే ఆమె తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిందని, 2011లో రాజకీయ నాయకుడైన రవి రానాను ప్రేమించి పెళ్లి చేసుకున్నారని తెలిపారు. అతను రాజకీయ నాయకుడు అవ్వడంతో ఆయన నుంచి రాజకీయం గురించి ఎంతో నేర్చుకుందని, పేద ప్రజల కష్టాలు, విద్యార్థుల కష్టాలు, రైతుల కష్టాలు చూసి వారికోసం ఏదైనా చేయాలనే ఆలోచన ఆమెకు రావడం గమనించిన భర్త, ఆమెని కూడా రాజకీయాల్లోకి రావాలని ఆహ్వానించారని ఆమె చెప్పారు. ఆమె భర్త సపోర్ట్ తోనే ఈరోజు ఆమె ఎంపీ అయ్యిందని, నవనీత్ కౌర్ చెప్పుకొచ్చారు. అయితే పార్లమెంట్ కు కొత్త అయినప్పటికీ దైర్యంగా కొన్ని అంశాలను ప్రస్తావించినట్లు ఆమె తెలిపారు. దీంతో పలువురు నేతలు 'మీరు మొదటిసారి పార్లమెంటుకు వచ్చినట్లు లేదు సీనియర్ ఎంపీల కనిపిస్తున్నారు, అని ఆమెపై ప్రశంసల వర్షం కురుస్తోందని నవనీత్ కౌర్ వెల్లడించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: