కేంద్రంలో రెండోసారి అధికారాన్ని చేపట్టిన బీజేపీ స‌ర్కారు త‌ర‌ఫున కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఈనెల 5న ప్రవేశపెట్టనున్నారు.  2019–20 ఆర్థిక సంవత్సరానికి  సంబంధించి పూర్తి స్థాయి బడ్జెట్ ను నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోతున్నారు. బడ్జెట్ లో వివిధ వర్గాల ప్రజలు తమ  ఆకాంక్షలు నెరవేరాలని కోరుతున్నారు.  బడ్జెట్‌ ఎలా ఉండబోతుందన్న ఆసక్తి అందరిలో నెలకొంది. బడ్జెట్‌లో ఏయే వర్గాలకు ఊరట లభిస్తుందనే అంశంపై  మార్కెట్ లో అప్పుడే  ఊహాగానాలు మొదలయ్యాయి. దేశ ఆర్థిక వ్యవస్థ డౌన్ వర్డ్ ట్రెండ్‌లో ఉన్నందున కేంద్రం కొన్ని కఠిన చర్యలు తీసుకుంటుందన్న అభిప్రాయాలు మార్కెట్ వర్గాల్లో వినిపిస్తున్నాయి.


పించ‌న్ పెంచాల‌ని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మార్కెట్‌లో అన్ని రకాల వస్తువులు, సేవల ధరలు పెరిగిపోవడంతో సామాన్యుడి బతుకు భారమైపోయిందంటూ రాబోయే బడ్జెట్‌లో కనీస వేతనం.. కనీస పింఛన్‌ను డిమాండ్ చేస్తున్నాయి వాణిజ్య సంఘాలు. కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ శాఖల సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్‌కు ఇప్పటికే ఈ మేరకు విజ్ఞప్తులు అందించాయి. విద్య, వైద్య సదుపాయాలనూ పొందలేని దుర్భర స్థితిలో చాలామంది ఉద్యోగులు, కార్మికులున్నారని వారికి ధైర్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని సదరు సంఘాలు ఈ సందర్భంగా అభిప్రాయపడ్డాయి. ఈ క్రమంలోనే కనీస వేతనాన్ని రూ.20 వేలకు పెంచాలని, రూ.6 వేల పింఛన్ ఇవ్వాలని, గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 200 రోజుల పని కల్పించాలని కేంద్రానికి సూచించాయి. ఐటీ శ్లాబుల పరిధిని పెంచి రూ.10 లక్షల వరకు ఆదాయంపై ఎటువంటి పన్ను విధించకూడదని, సీనియర్ సిటిజన్లను రూ.8 లక్షల ఆదాయ శ్లాబులో తేవాలని, వీరి గృహ, ఇతర అలవెన్సులపై పన్ను వేయరాదని కోరాయి. అలాగే ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించవద్దని, వీటికి మరిన్ని పెట్టుబడులను అందించాలని డిమాండ్ చేశాయి. కార్మికుల్లో నైపుణ్యాల పెంపునకు చర్యలు తీసుకోవాలని కోరాయి.


బడ్జెట్​లో ఇన్​కం ట్యాక్స్​ కట్టేవాళ్లకు ఊరట లభించే అవకాశముంది. సీనియర్​ సిటిజన్లకు, ఆడవాళ్లకు  దీనివల్ల లాభం కలగనుంది. ప్రస్తుతం సీనియర్​ సిటిజన్లు రూ.3 లక్షల వరకు ఆదాయ పన్ను కట్టాల్సిన అవసరం లేదు. ఈ​ లిమిట్​ను మరో రూ.50 వేలు పెంచే సూచనలు ఉన్నాయి. మ‌హిళ‌ల‌కు కూడా ఈ పరిమితి​ భారీగా పెరగొచ్చని అంటున్నారు. సెక్షన్​–80 ద్వారా లభిస్తున్న డిడక్షన్​ లిమిట్​ లక్షన్నర నుంచి రెండున్నర లక్షలకు పెరిగే ఛాన్స్​ ఉంది. పన్ను చెల్లించేవారి సంఖ్య పెరిగినా కేంద్రానికి ఆశించినంత ఆదాయం రావట్లేదు. దీనికి రెండు కారణాలు దారితీస్తున్నాయని సర్కారు భావిస్తోంది. ఒకటి.. కొత్తగా ట్యాక్స్​ రిటర్న్​లు ఫైల్​ చేసేవాళ్లకి పెద్ద మొత్తంలో పన్నులు కట్టే స్థాయిలో ఆదాయం లేకపోవటం. రెండు.. సరైన ట్యాక్స్​లు చెల్లించకపోవటం. ఈ పరిస్థితిలో మార్పు తెచ్చేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించనుంది. టెక్నాలజీ ఉపయోగించి సరైన పన్నులు చెల్లించనివారికి ఆ విషయాన్ని చెబుతుంది. తద్వారా వాళ్లు మరోసారి ఆ తప్పు చేయకుండా చూస్తుంది. నిజాయితీగా ట్యాక్స్​ కట్టేవారికి పన్ను భారాన్ని సాధ్యమైనంత తగ్గిస్తుంది. అలాంటి వారిని ఎంకరేజ్​ చేయటానికి చర్యలు చేపడుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: