రాయ‌ల‌సీమ‌. ఒక‌నాడు ర‌త‌నాల సీమ‌. అయితే, నేడు మాత్రం చుక్క‌నీటి కోసం అల్లాడుతున్న క‌టిక క‌రువు సీమ‌గా మారి పోయింది. అయినా కూడా ఇక్క‌డి నాలుగు జిల్లాల్లో రాజ‌కీయ చైత‌న్యం ఎక్కువ‌. ఒకింత చిత్తురు విష‌యంలో క‌రువు త క్కువ‌గానే ఉన్నా.. మిగిలిన మూడు జిల్లాల్లోనూ మాత్రం క‌రువు ర‌క్క‌సి కాటేస్తోంది. అదేస‌మ‌యంలో తాము ఏపీలోని మి గిలిన ప్రాంతాల క‌న్నా కూడా చాలా వెనుక‌బాటు త‌నంలో ఉన్నామ‌ని ఇక్క‌డి ప్ర‌జ‌లు నొచ్చుకుంటున్నారు. ప్ర‌త్యేక రాయల సీమ‌, ప్ర‌త్యేక రాష్ట్రం నినాదం ఆ మ‌ధ్య మ‌న‌కు గ‌ట్టిగానే వినిపించింది. 


అదేస‌మ‌యంలో హైకోర్టు బెంచ్‌ను ఏర్పాటు చేయాల‌ని, క‌ర్నూలును రెండో రాజ‌ధానిగా ప్ర‌క‌టించాల‌ని కూడా డిమాండ్లు వ‌చ్చాయి. గ‌త ప్ర‌భుత్వం ఉన్న స‌మ‌యంలో సీమ చాలా వ‌ర‌కు ఉదాసీన‌త‌కు గుర‌య్యింద‌నే వ్యాఖ్య‌లు కూడా వినిపిం చాయి. అయిన‌ప్ప‌టికీ.. ఈ డిమాండ్ల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్న క‌డ‌ప ఉక్కుఫ్యాక్ట‌రీ స‌హా కియా మోటారు కంపెనీల‌ను సీమ‌లో ఏర్పాటు చేశారు. ఫ‌లితంగా కొంత మేర‌కు డిమాండ్లు త‌గ్గినా.. తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో మాత్రం ఇక్క‌డి ప్ర‌జ‌లు గుండుగుత్తుగా జ‌గ‌న్ ప‌క్షాన నిల‌వ‌డాన్ని బ‌ట్టి ఆయ‌న‌పై ఎక్కువ‌గానే హోప్స్ పెట్టుకున్నార‌ని తెలుస్తోంది. 


రాయ‌ల‌సీమ‌లోని మొత్తం 52 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌కు గాను జ‌గ‌న్ పార్టీ ఏకంగా 49 స్థానాల్లో విజ‌యం సాధించింది. దీనిని బ‌ట్టి ఇక్క‌డి ప్ర‌జ‌లు జ‌గ‌న్‌పై చాలానే భారం పెట్టార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. బ‌హుశ దీనిని గ‌మ‌నించిన జ‌గ‌న్ వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఇక్క‌డి ప్ర‌జ‌ల‌ను సంతృప్తి ప‌రిచేలా నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే తెలంగాణ‌తో జ‌ల వివాదాల‌పై స్పందించిన‌ప్పుడు స్ప‌ష్టంగా సీమ ప్ర‌యోజ‌నాల‌ను ఆయ‌న ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్నారు. 


సీమ‌లోని నాలుగు జిల్లాల‌కు నీరు అందేలా గోదావ‌రి నుంచి ఎత్తిపోత‌ల ద్వారా శ్రీశైలానికి నీరు చేరాల‌నే కండిష‌న్ పెట్టారు. త‌ద్వారా ఇటు ప‌ట్టిసీమ‌, పోల‌వ‌రం పూర్త‌య్యాక దాని నుంచి నీటి ని విడుద‌ల చేయ‌డంతోపాటు రాబోయే రెండేళ్ల‌లో తెలంగాణ‌తో క‌లిసి గోదావ‌రి న‌దిపై నిర్మించే ఆన‌క‌ట్ట‌ల ద్వారా సీమ‌ను స‌శ్య శ్యామ‌లం చేయాల‌ని జ‌గ‌న్ నిర్ణ‌యించుకుంటున్న‌ట్టు చెబుతున్నారు. ఈ క్ర‌మంలోనే సీమ‌రుణం తీర్చుకుంటున్నారంటూ జ‌గ‌న్‌పై సోష‌ల్ మీడియాలో పోస్టులు వ‌స్తున్నాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: