ఏపీలో రాజకీయం రంజుగా ఉంది. ఎన్నికలు అయిపోయినా కూడా  రాజకీయ మసాలా అలాగే సాగుతోంది. గెలిచిన వైసీపీ ఓడిన టీడీపీ, జనసేన, బీజేపీ ఇలా అన్ని పార్టీలు కూడా పొలిటికల్ గేం ని మళ్ళీ మొదలెట్టేసాయి. దీంతో ఎవరేంటో తెలీక  మళ్లీ అయోమయమే నెలకొంది.


జగన్ ఇపుడు సీఎం. అధికారంలో  ఉన్నారు. అయినా సరే ప్రతిపక్షం గురించి కలవరిస్తున్నారు. ఆయన కొత్త ఎమ్మెల్యేల శిక్షణా తరగతుల్లో మాట్లాడుతూ ప్రతిపక్షం ఉండాలని గట్టిగా కోరుకున్నారు. ఈ మాట ఆయన గత నెలలో జరిగిన అసెంబ్లీ తొలి సమావేశాంల్లోనూ ప్రస్తావించారు. ప్రతిపక్షం ఉండాలన్నది మా కోరిక. అందుకే మేము టీడీపీ ఎమ్మెల్యేలను లాగేయడంలేదని స్పష్టంగా చెప్పారు.


ఇపుడు మరో సారి జగన్ అదే మాట అన్నారు. మరి వైసీపీ లాగకపోతే టీడీపీ ఎమ్మెల్యేలు అలాగే ఉండాలి కదా, మరి జగన్ ఎందుకు ఇంత గట్టిగా పట్టుపట్టి మరీ అదే మాట అంటున్నారు. అంటే బీజేపే ఓ వైపు టీడీపీ ఎమ్మెల్యేలను కోడి పిల్లలను గద్ద తన్నేసుకునిపోయినట్లుగా తీసుకుపోతోంది. దాంతోనే జగన్ స్ట్రాంగ్ గా ఈ మాటలు అంటున్నారనుకోవాలి. 


ప్రతిపక్షం ఉండాలి అంటున్న జగన్ బీజేపీకి ఇండైరెక్ట్ గా హెచ్చరికలు పంపుతున్నారనుకోవాలి. మరి జగన్ మాటలు కమలనాధులకు పడతాయా. అసెంబ్లీలో ఫిరాయింపులపై జగన్ కట్టిన కత్తి కి బీజేపీ భయపడుతుందా చూడాలి మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: